నితిన్ యమా స్పీడ్ గురూ


Nithin
Nithin

నితిన్ ఇప్పుడు యమా స్పీడమీదున్నాడు. దానికి కారణం ప్రస్తుతం నితిన్ వెంకీ కుడుముల దర్శకత్వంలో చేస్తోన్న భీష్మ సినిమాపై ఉన్న కాన్ఫిడెన్స్ అని తెలుస్తోంది. ఈ సినిమా చాలా బాగా వస్తుండడంతో నితిన్ హ్యాపీగా తన పని తాను చేసుకుని వెళ్ళిపోతున్నాడట. ప్రస్తుతం నితిన్ భీష్మ సినిమా డబ్బింగ్ పనుల్లో బిజీగా ఉన్నాడని సమాచారం. క్రిస్మస్ సందర్భంగా విడుదల కాబోయే భీష్మ సినిమా ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది.

ఈ చిత్రంలో కామెడీ ప్రధానంగా హైలైట్ కానుందని తెలుస్తోంది. ఛలో సినిమాను కామెడీ ప్రధానంగా తెరకెక్కించిన వెంకీ కుడుముల భీష్మలోనూ అదే చేయబోతున్నాడు. ముఖ్యంగా నితిన్ – వెన్నెల కిషోర్ మధ్య వచ్చే సీన్స్ హిలేరియస్ గా ఉంటాయని సమాచారం. హెబ్బా పటేల్ నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో నటిస్తున్న ఈ సినిమాలో రష్మిక నితిన్ సరసన ఆడిపాడనుంది.