త్రివిక్రమ్ పైనే ఆశలు పెట్టుకున్న టాలెంటెడ్ భామ


niveda peturaj pins hopes on ala vaikunthapuramulo
త్రివిక్రమ్ పైనే ఆశలు పెట్టుకున్న టాలెంటెడ్ భామ

కొంత మంది ఎంత మంచి నటులైనా కానీ లక్ ఫ్యాక్టర్ లేకపోవడం వల్ల సరైన అవకాశాలను అందుకోలేరు. కొందరు మంచి చిత్రాల్లో నటించినా కానీ తమ పాత్ర సరిగ్గా ప్రేక్షకులకు రిజిస్టర్ అవ్వక హైప్ లోకి రాలేరు. ఇదే కోవలోకి చెందుతుంది టాలెంటెడ్ నటి నివేద పేతురాజ్. మెంటల్ మదిలో చిత్రంతోనే ఆమె ఎంత మంచి నటి అనేది అందరికీ తెల్సింది.

ఆమె ఖాతాలో చిత్రలహరి, బ్రోచేవారెవరురా వంటి హిట్స్ కూడా ఉన్నాయి. అయితే ఈ రెండు చిత్రాల్లో ఆమెది సెకండ్ లీడ్ కావడం వల్ల ప్రేక్షకులలో తగిన గుర్తింపు రాలేదు. టాలెంట్ తో పాటు గ్లామర్ విషయంలో కూడా ఆమె తగ్గేది లేదు కానీ ఆమె సరైన బ్రేక్ కోసం ఎదురుచూస్తోంది. ఆ బ్రేక్ అల్లు అర్జున్ లీడ్ లో వస్తోన్న అల వైకుంఠపురములో ఇవ్వగలదని ఆమె ఆశలు పెట్టుకుంది.

ఈ చిత్రంలో పూజా హెగ్డే కథానాయిక అయినా కూడా నివేద సెకండ్ ఫిమేల్ లీడ్ గా నటిస్తోంది. త్రివిక్రమ్ శ్రీనివాస్ కు ఫ్యామిలీ ఆడియన్స్ లో మంచి ఫాలోయింగ్ ఉంది కనుక తనకు తగిన గుర్తింపు వస్తుందని ఆమె ఆశిస్తోంది. అయితే త్రివిక్రమ్ సినిమాల్లో ఫిమేల్ లీడ్ పాత్రలే అంత స్ట్రాంగ్ గా ఉండవు. ఇక సెకండ్ లీడ్ కూడా అంటే ఎక్కువ ఆశిస్తోందేమో!