అల్లు అర్జున్ సినిమాలో నటించడం లేదట


అల్లు అర్జున్త్రివిక్రమ్ ల కాంబినేషన్ లో ముచ్చటగా మూడో సినిమా రూపొందుతున్న విషయం తెలిసిందే . కాగా ఆ చిత్రంలో అల్లు అర్జున్ చెల్లెలు గా నివేదా థామస్ నటించనున్నట్లు ఊహాగానాలు వినిపించాయి . ఈ ఊహాగానాలు మరింతగా ఎక్కువ కావడంతో అవి నివేదా థామస్ చెవిన పడ్డాయి . దాంతో స్పందించిన నివేదా అల్లు అర్జున్ సినిమాలో నటించడం లేదని , నన్ను ఆ పాత్ర కోసం ఎవరూ సంప్రదించలేదని స్పష్టం చేసింది .

నివేదా థామస్ స్వయంగా ఈ విషయం చెప్పడంతో ఇక అల్లు అర్జున్ సినిమాలో నివేదా నటించడం లేదన్నది తేటతెల్లమయ్యింది . నివేదా థామస్ టాలెంట్ అద్భుతమనే చెప్పాలి . ఇప్పటికే తనదైన నటనతో చెరగని ముద్ర వేసింది . నివేదా కన్ఫర్మ్ చేసింది కాబట్టి ఆ పాత్రలో మరొకర్ని త్రివిక్రమ్ ఎంచుకోవడం ఖాయం .