`ప్రేమ‌మ్‌` హీరో చిత్రానికి మూడు అవార్డులు!Nivin pauly  Moothan bags three awards at New York Indian Film Festival2

మ‌ల‌యాళ హిట్ చిత్రం `ప్రేమ‌మ్‌`తో పాపుల‌ర్ అయ్యారు నివిన్ పాలీ. ఆయ‌న న‌టించించిన మ‌రో మ‌ల‌యాళ చిత్రం `కాయంకుళం కొచున్న`.. ఇలా ప్ర‌తీ చిత్రంతోనూ హీరోగా, మంచి న‌టుడిగా గుర్తింపుని సొంతం చేసుకున్న నివిన్  పాలీ దేశ వ్యాప్తంగా గుర్తింపుని పొందారు. తాజాగా నివిన్ పాలీ న‌టించిన మ‌ల‌యాళ చిత్రం `మూత‌న్‌`. న్యూయార్క్ ఇండియ‌న్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్‌లో స‌త్తా చాటింది.

ప్ర‌తిష్టాత్మ‌క న్యూయార్క్ ఇండియ‌న్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్‌లో ఈ సినిమా ఏకంగా మూడు అవార్డుల్ని సొంతం చేసుకుంది. అక్బ‌ర్ పాత్ర‌లో నివిన్ పాలీ అద్భుత‌మైన న‌ట‌న‌ని ప్ర‌ద‌ర్శించారు. ఈ చిత్రానికి గానూ నివిన్ పాలీకి ఉత్త‌మ న‌టుడిగా అవార్డు రాగా, బెస్ట్ చైల్డ్ ఆర్టిస్ట్‌గా సంజ‌నా దీపు,  ఉత్త‌మ చిత్రంగా మ‌రో అవార్డుని ఈ చిత్రం ద‌క్కించుకుంది. ఈ అవార్డుని ద‌క్కించుకున్న తొలి మ‌ల‌యాళ న‌టుడు నివిన్ పాలి కావ‌డం విశేషంగా చెబుతున్నారు.

గ‌త ఏడాది న‌వంబ‌ర్‌లో మ‌ల‌యాళ‌, హిందీ భాష‌ల్లో ఈ థ్రిల్ల‌ర్ చిత్రం విడుద‌లై విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌ల్ని సొంతం చేసుకుంది. గీతూ మోహ‌న్‌దాస్ డైరెక్ట్ చేసిన ఈ మూవీ ని ప్ర‌ముఖ బాలీవుడ్ ద‌ర్శ‌కుడు అనురాగ్ క‌శ్య‌ప్ నిర్మించారు. నివిన్ పాలితో పాటు ఈ చిత్రంలో శోభిత ధూళిపాళ‌, శ‌శాంక్ అరోరా, రోష‌న్ మాథ్యూ, సంజ‌నా దీపూ త‌దిత‌రులు న‌టించారు.