నైజాం దాదా మహేశ్ బాబు !

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు నైజాం దాదా గా తన సత్తా చాటాడు . మహర్షి చిత్రం కేవలం నాలుగు రోజుల్లోనే 16 కోట్ల 61 లక్షల షేర్ వసూల్ చేయడంతో నాన్ బాహుబలి రికార్డులన్నీ బద్దలయ్యాయి . మే 9 న విడుదలైన మహర్షి చిత్రానికి డివైడ్ టాక్ వచ్చినప్పటికి మహేశ్ బాబు కున్న క్రేజ్ తో ఈ భారీ వసూళ్లు సాధ్యమయ్యాయి . నైజాం లో నాలుగు రోజులు పూర్తయినప్పటికి ఎక్కడా కలెక్షన్లు తగ్గలేదు . ఇక ఒక్క నైజాం లోనే ఆరు రోజుల్లోనే 20 కోట్ల 45 లక్షలు వసూల్ చేయడంతో సరికొత్త రికార్డుల దిశగా దూసుకుపోతున్నాడు మహేశ్ బాబు .

6 రోజుల్లో 20 కోట్లకు పైగా షేర్ వసూల్ కావడంతో నైజాం సరికొత్త దాదా గా మహేశ్ అవతరించాడు అని అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు . మహేశ్ బాబు సరసన పూజా హెగ్డే నటించగా వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించాడు . రెండు తెలుగు రాస్ట్రాలలో 6 రోజుల్లో 55 కోట్లకు పైగా షేర్ వసూల్ చేయడంతో మహర్షి తెలుగు రాస్ట్రాలలో బ్రేక్ ఈవెన్ దిశగా దూసుకుపోతోంది . దాంతో మహేశ్ బాబు తో పాటుగా మహేశ్ ఫ్యాన్స్ కూడా చాలా సంతోషంగా ఉన్నారు .