మ‌హేష్ ఫ్యాన్స్‌కు బ‌ర్త్‌డే ట్రీట్ లేన‌ట్టేనా?



మ‌హేష్ ఫ్యాన్స్‌కు బ‌ర్త్‌డే ట్రీట్ లేన‌ట్టేనా?
మ‌హేష్ ఫ్యాన్స్‌కు బ‌ర్త్‌డే ట్రీట్ లేన‌ట్టేనా?

`స‌రిలేరు నీకెవ్వ‌రు` వంటి బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ త‌రువాత స్టార్ హీరో మ‌హేష్ బాబు న‌టిస్తున్న తాజా చిత్రం `స‌ర్కారు వారి పాట‌`. ప‌ర‌శురామ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. మైత్రీ మూవీమేక‌ర్స్‌, 14 రీల్స్ ప్ల‌స్, జీఎంబీ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మే 31న సూప‌ర్ స్టార కృష్ణ పుట్టిన రోజున ఈ చిత్ర ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్‌ని రిలీజ్ చేసిన విష‌యం తెలిసిందే.

కీర్తి సురేష్ హీరోయిన్‌గా న‌టిస్తున్న ఈ చిత్రంలో విల‌న్ పాత్ర కోసం అర‌వింద స్వామి, ఉపేంద్ర‌, సుదీప్‌ల‌ని ద‌ర్శ‌కుడు ప‌ర‌శురామ్ సంప్ర‌దిస్తున్నార‌ని గ‌త కొన్ని రోజులుగా వార్త‌లు వినిపిస్తున్నాయి. ఇదిలా వుంటే ఈ చిత్రాన్ని ఇటీవ‌ల ప్రారంభించాల‌ని ప్లాన్ చేశారు. అయితే క‌రోనా వైర‌స్ కార‌ణంగా షూటింగ్ చేయ‌డానికి సిబ్బంది భ‌య‌ప‌డుతుండ‌టంతో స్టార్ హీరోస్ ఎవ‌రూ సెట్‌లోకి రావ‌డానికి సాహ‌సించ‌డం లేదు. హీరో మ‌హేష్ కూడా వ్యాక్సిన్ వ‌చ్చిన త‌రువాతే సెట్స్‌కి వెళ్లాల‌ని నిర్ణ‌యించుకున్నార‌ట‌.

దీని వ‌ల్ల ఫ్యాన్స్‌కు మ‌హేష్ బ‌ర్త్‌డే ట్రీట్ లేకుండా పోయింది. మ‌హేష్ పుట్టిన రోజు ఆగ‌స్టు 9. ఈ రోజు ఫ్యాన్స్‌కు స్పెష‌ల్ ట్రీట్ ఇవ్వ‌డం లేద‌ని తెలుస్తోంది. షూటింగ్  ప్రారంభిస్తే `స‌ర్కారు వారి పాట‌` చిత్రం నుంచి టీజ‌ర్ లేదా మ‌రో లుక్ వ‌చ్చే అవ‌కాశం వుండేది. క‌రోనా భ‌యంతో షూటింగ్ చేయ‌క‌పోవ‌డంతో టీజ‌ర్ వ‌చ్చే అవ‌కాశం లేద‌ని, ఈ ద‌ఫా ఫ్యాన్స్‌కి నిరాశే మిగ‌ల‌నుంద‌ని టాలీవుడ్‌లో వినిపిస్తోంది.