ఆ సినిమాని ఎవ్వరూ కొనలేదట


no buyers in nizam for nagarjunas officer

కింగ్ నాగార్జున హీరోగా నటించిన చిత్రం ” ఆఫీసర్ ”. రాంగోపాల్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ ఆఫీసర్ చిత్రాన్ని ఈనెల 25న విడుదల చేయాలనుకున్నారు అయితే నైజాం లో ఆఫీసర్ చిత్రాన్ని కొనడానికి ఎవరూ ముందుకు రాలేదు దాంతో సినిమా వాయిదా పడటమే కాకుండా సొంతంగా విడుదల చేయడానికి ముందుకు వచ్చాడు దర్శకులు రాంగోపాల్ వర్మ . గతకొంత కాలంగా రాంగోపాల్ వర్మ కు సరైన హిట్ లేదు పైగా చాలాకాలంగా చెత్త రికార్డ్ అతడి పేరిట ఉంది .

చేస్తున్న సినిమాలన్నీ విడుదల అవుతున్నాయి బయ్యర్ల ని నట్టేట ముంచుతున్నాయి దాంతో హీరో నాగార్జున అయినప్పటికీ ఆ సినిమా మీద నమ్మకం లేకపోవడంతో కొనేవాళ్ళు లేకుండా పోయారు . నాగార్జున – వర్మ ల కాంబినేషన్ లో పాతికేళ్ల క్రితం శివ చిత్రం వచ్చి సంచలనం సృష్టించింది అంతేకాదు తెలుగు సినిమా గమనాన్ని కూడా మార్చింది . కట్ చేస్తే శివ తర్వాత నాగార్జున – వర్మ ల కాంబినేషన్ లో గోవిందా గోవిందా , అంతం చిత్రాలు వచ్చాయి కానీ అవి ప్లాప్ అయ్యాయి . ఇక ఇప్పుడేమో ఆఫీసర్ వస్తోంది , మరి ఈ సినిమా ఏమౌతుందో చూడాలి .