పబ్లిసిటీ వద్దా దేవదాస్


No buzz for devadas

అక్కినేని నాగార్జుననాని కాంబినేషన్ లో రూపొందిన చిత్రం ” దేవదాస్ ”. శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో వైజయంతి మూవీస్ పతాకంపై ఈ చిత్రం నిర్మించారు అశ్వనీదత్ . మల్టీస్టారర్ చిత్రం కావడంతో ఎంతో బజ్ రావాలి కానీ దేవదాస్ చిత్రానికి మాత్రం అస్సలు బజ్ లేదు అలాగే ఈ సినిమాకు పబ్లిసిటీ కూడా చేయడం లేదు . సినిమా ఈనెల 27 న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు అంటే ఏడు రోజుల సమయం ఉంది , సరిగ్గా చెప్పాలంటే ఐదు రోజుల సమయమే ! ఈరోజు దాదాపుగా అయిపోవచ్చింది , 27 ఎలాగూ రిలీజ్ అంటే మధ్యలో అయిదు రోజులే ! కానీ పబ్లిసిటీ మాత్రం అస్సలు చేయడం లేదు ఏంటో మరి . పబ్లిసిటీని పక్కన పెడితే సినిమాకు కూడా అంతగా పాజిటివ్ టాక్ లేదు .

నాగార్జున – నాని కాంబినేషన్ అనగానే భారీ బడ్జెట్ అనుకుంటారు కానీ ఈ సినిమాకు పెద్దగా ఖర్చు చేయలేదు దాంతో శాటిలైట్ , డిజిటల్ రైట్స్ , డబ్బింగ్ రైట్స్ రూపంలో వచ్చే సొమ్ముతో పాటుగా ఒకటి రెండు ఏరియాలు కలిపితే సరిపోతుంది . మిగతాదంతా లాభాలే ! అయినప్పటికీ పెద్దగా ప్రచారం చేయడంలేదు . సినిమాపై నమ్మకం లేకనా ? లేదా మా డబ్బులు మాకొచ్చాయి ఇక బయ్యర్లకు వస్తే ఎంత ? రాకపోతే ఎంత ? అని అనుకుంటున్నారో ? నాగార్జున సరసన ఆకాంక్ష సింగ్ నటిస్తుండగా నాని సరసన క్రేజీ భామ రష్మిక మందన్న నటిస్తోంది .

English Title: No buzz for devadas