ఒక్కదానికి బజ్ లేదు


No buzz for Four movies

ఈరోజు నాలుగు సినిమాలు విడుదల అవుతున్నాయి అయితే అందులో ఒక్క సినిమాకు కూడా పాజిటివ్ వైబ్రేషన్స్ లేకపోవడంతో ఆ సినిమాలపై అంతగా అంచనాలు లేకుండాపోయాయి . మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ నటించిన ” ఒడియన్ ” సినిమా ఈరోజే విడుదల అవుతోంది , రాంగోపాల్ వర్మ నిర్మించిన భైరవగీత ,అలాగే ,హుషారు , అనగనగా ఓ ప్రేమకథ చిత్రాలు విడుదల అవుతున్నాయి .

భైరవగీత చిత్రం నాలుగు బాషలలో విడుదల అవుతోంది ఇప్పటికే కన్నడంలో విడుదల అయ్యింది . అయితే అక్కడ భైరవగీత వసూళ్లు ఫరవాలేదని పిస్తున్నాయి . మరి ఇక్కడ ఎలా ఉంటుందో చూడాలి . గతకొంత కాలంగా వర్మ చిత్రాలన్నీ డిజాస్టర్ లే అవుతున్నాయి అయితే ఇది వర్మ నిర్మించిన చిత్రం కావడం విశేషం . అంటా కొత్తవాళ్లతో వస్తున్న చిత్రాలు హుషారు , అనగనగా ఓ ప్రేమకథ మరి ఈ చిత్రాలు ఎలాంటి ఫలితాన్ని పొందుతాయో తెలియాలంటే కొద్దిగంటలు ఎదురు చూడాల్సిందే .

English Title: No buzz for Four movies