పడిపడి లేచే మనసు పరిస్థితి ఏంటి ?

No buzz for sharwanand padi padi leche manasu శర్వానంద్ హీరోగా సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తున్న చిత్రం పడిపడి లేచే మనసు . లై సినిమాతో ఘోర పరాజయాన్ని అందుకున్న దర్శకుడు హను రాఘవపూడి ఈ సినిమాకు దర్శకుడు దాంతో ఈ సినిమాపై పెద్దగా అంచనాలు లేకుండా పోయాయి . శర్వానంద్ కూడా సినిమా చేసి చాలా రోజులు అవుతోంది గ్యాప్ ఎక్కువ రావడంతో ఈ సినిమాపై బజ్ లేకుండా పోయింది . ఒకవైపు ప్లాప్ దర్శకుడు మరోవైపు శర్వానంద్ నుండి ఆలస్యంగా వస్తున్న సినిమా కావడంతో ఈ సినిమాపై బయ్యర్లకు కానీ ప్రేక్షకులకు కానీ ఆసక్తి లేకుండాపోయింది . ఈ సినిమాని డిసెంబర్ లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు . అయితే రిలీజ్ కి ఇంకా నెల పైనే గడువు ఉంది కాబట్టి మెల్లిగా హైప్ క్రియేట్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు .

అయితే ఎన్ని ప్రయోగాలు చేసినా పడిపడి లేచే మనసు పైకి లేచేలా కనిపించడం లేదు . కాకపోతే ఈ సినిమాకు ఉన్న ప్లస్ పాయింట్ ఏంటంటే శర్వానంద్ రొటీన్ సినిమాలు అయితే చేయడం లేదు . గతకొంత కాలంగా ఏదో ఒక విభిన్నత చూపిస్తూనే ఉన్నాడు దాంతో కొంతవరకు ఈ సినిమా పట్ల పాజిటివ్ గా ఉండే అంశం అయ్యింది . శర్వానంద్ మాత్రమే తన ఇమేజ్ తో ఈ సినిమా కోసం ప్రేక్షకులను థియేటర్ ల వరకు తీసుకు రావచ్చు .

English Title: No buzz for sharwanand padi padi leche manasu