చిరంజీవికి ఇక ఛాన్స్ ఇవ్వరట


మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ తరుపున రాజ్యసభ కు ప్రాతినిధ్యం వహిస్తున్న విషయం తెలిసిందే , అయితే ఆ పదవీకాలం త్వరలోనే పూర్తికానున్న నేపథ్యంలో మరోసారి చిరంజీవి కి రాజ్యసభ సభ్యత్వం ఇస్తుందా అన్న చర్చ జరుగుతోంది అయితే తాజాగా వినబడుతున్న కథనం ప్రకారం చిరంజీవి కి ఇక ఛాన్స్ ఇచ్చేది లేదని అంటున్నారు ఎందుకంటే చిరంజీవి కాంగ్రెస్ పార్టీ కి పెద్దగా ఉపయోగపడింది ఏమి లేదు ఈ నాలుగేళ్ళ కాలంలో దాంతో అతడి పై కాంగ్రెస్ అధిష్టానం తీవ్ర అసంతృప్తి గా ఉందట .

చిరంజీవి రాజకీయాల్లోకి వచ్చి విఫలమైన తర్వాత తన దృష్టి అంతా సినిమాలపైనే పెట్టిన విషయం తెలిసిందే . అందులో భాగంగానే ఖైదీ నెంబర్ 150 చిత్రం చేసాడు అది సూపర్ డూపర్ హిట్ కావడంతో అది ఇచ్చిన జోష్ తో సైరా ….. నరసింహారెడ్డి చిత్రం చేస్తున్నాడు . అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో భారీ తారాగణం నటిస్తున్నారు . ఇక ఈ సినిమాపై చిరంజీవి భారీగానే ఆశలు పెట్టుకున్నాడు . 2019 లో రెండు తెలుగు రాష్ట్రాలలో ఎన్నికలు జరుగుతున్నందున చిరంజీవి ఎటువంటి అడుగులు వేస్తాడో చూడాల్సిందే . చిరు నిర్ణయాత్మక శక్తి కాలేకపోయాడు కాబట్టి అతడిపై పెద్దగా అంచనాలు కూడా లేవు .