యంగ్ మెగా హీరో సినిమా పరిస్థితి ఏంటి?


యంగ్ మెగా హీరో సినిమా పరిస్థితి ఏంటి?
యంగ్ మెగా హీరో సినిమా పరిస్థితి ఏంటి?

మెగా ఫ్యామిలీ నుండి ఇండస్ట్రీకి పరిచయమైన మరో నటుడు వైష్ణవ్ తేజ్. ఉప్పెన సినిమాతో అరంగేట్రం చేస్తున్నాడు ఈ యంగ్ హీరో. ఈ సినిమా షూటింగ్ ఎప్పుడో పూర్తయింది. గతేడాది ఏప్రిల్ లో సినిమాను విడుదల చేయాలనుకున్నారు. కానీ కరోనా ప్రభావం వల్ల సినిమాను విడుదల చేయలేకపోయారు.

థియేటర్లు ఓపెన్ అయ్యాక ఉప్పెన సినిమాను విడుదల చేస్తారని ఆశించారు. సంక్రాంతికి ఈ సినిమా విడుదలైతే రెవిన్యూ పరంగా బాగుండేది. కానీ ఉప్పెన సంక్రాంతికి ఎటువంటి ప్రకటన చేయలేదు. ఫిబ్రవరిలో సినిమాను విడుదల చేయాలనుకుంటున్నారని తెలుస్తోంది.

అయితే ఉప్పెన చిత్రానికి పెట్టిన బడ్జెట్ కు ఫెస్టివల్ రిలీజ్ అయితే వెసులుబాటు ఉండేది. కానీ ఫిబ్రవరిలో రిలీజ్ అయితే దాదాపు 20 కోట్ల బడ్జెట్ ను ఏమేరకు రికవర్ చేస్తారన్నది చూడాలి. బుచ్చి బాబు సనా ఈ చిత్రానికి దర్శకుడు. సుకుమార్, మైత్రి మూవీస్ మేకర్స్ ఈ సినిమాను నిర్మించారు. కృతి శెట్టి హీరోయిన్ గా నటించింది. విజయ్ సేతుపతి కీలక పాత్రలో కనిపించనున్నాడు.