ఈ వారం నానికి ఎదురేలేదు?!


Nani
ఈ వారం నానికి ఎదురేలేదు?

న్యాచురల్ స్టార్ నాని నటించిన గ్యాంగ్ లీడర్ ఈరోజు విడుదలైంది. మొదట ఆగస్ట్ 30న ఈ చిత్రాన్ని విడుదల చేయాలని భావించినా సాహో విడుదల ఉన్న కారణంగా సెప్టెంబర్ 13కి వాయిదా వేశారు. అయితే అదే రోజున వాల్మీకి విడుదల ఉండడంతో ఈ రెండు చిత్రాల నిర్మాతలు చర్చలు జరిపి వాల్మీకి చిత్రాన్ని తర్వాతి వారానికి వాయిదా వేశారు. దీంతో గ్యాంగ్ లీడర్ సోలో రిలీజ్ కు మార్గం సుగమమైంది. అయితే ఇన్ని చేసినా కానీ ఈ వారం మరో చిత్రం విడుదలైంది.

అదే సుదీప్ నటించిన పహిల్వాన్. స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ ఉండడం, తెలుగులో సుదీప్ కు క్రేజ్ ఉండడం, పైగా సైరాలో సుదీప్ నటించడంతో తెలుగులో ఈ చిత్రం ఎంతో కొంత ప్రభావం చూపుతుందని ఆశించారంతా. అయితే నిన్ననే విడుదలైన పహిల్వాన్ కు రివ్యూలు ఓ మోస్తరు రేటింగ్ ఇచ్చాయి. కలెక్షన్లు కూడా డల్ గా ఉండడంతో ఇక గ్యాంగ్ లీడర్ కు ఈ వారం వరకూ తిరుగులేదు. ఇప్పటికే రివ్యూలు కూడా పాజిటివ్ గా వస్తుండడంతో నాని ఖాతాలో మరో హిట్ పడిందనుకోవచ్చు.