కండోమ్ వాడటం లేదట !

condom
condom

తెలుగువాళ్ళు పెద్దగా కండోమ్ వాడటం లేదట ! శృంగారంలో పాల్గొనే సమయంలో సురక్షితమైన శృంగారం కోసం కండోమ్ వాడకం తప్పనిసరి కానీ మన తెలుగు రాష్ట్రాలలోని ప్రజలు మాత్రం కండోమ్ ని పెద్దగా వాడటం లేదని స్పష్టం చేసింది ఐక్యరాజ్యసమితి . వాళ్ళ దగ్గర ఉన్న లెక్కల ప్రకారం 0.2 శాతం మంది మాత్రమే ఆంధ్రప్రదేశ్ లో కండోమ్ వాడుతున్నారట అలాగే తెలంగాణలో 0. 5 శాతం మంది మాత్రమే కండోమ్ ని ఇష్టపడుతున్నారట .

అంటే రెండు తెలుగు రాష్ట్రాలు కలిపి కేవలం 1 శాతం కూడా కండోమ్ లను వాడటం లేదు , అంటే ఈ లెక్కన సుఖ వ్యాధులు , ఎయిడ్స్ దారుణంగా ప్రబలే అవకాశం మెండుగా ఉందన్న మాట . శృంగారంలో పాల్గొన్నప్పుడు కండోమ్ పెట్టుకోవడం వల్ల అనిర్వచనీయమైన అనుభూతిని పొందలేకపోతున్నాం అందుకే కండోమ్ వద్దు అని అంటున్నారట తెలుగువాళ్లు . కానీ ఇలా చేయడం ద్వారా రోగాలకు ఆలవాలం అవ్వడం ఖాయం .