తరుణ్ భాస్కర్ కు అన్యాయం చేసారు


No credits to director Tharun bhascker పెళ్లి చూపులు చిత్రంతో జాతీయ స్థాయి అవార్డు తో పాటు ప్రేక్షకుల జేజేలు అందుకున్న దర్శకుడు దాస్యం తరుణ్ భాస్కర్ . అయితే అంతటి గొప్ప దర్శకుడికి బాలీవుడ్ అన్యాయం చేసింది . ఇంతకీ తరుణ్ భాస్కర్ కు జరిగిన అన్యాయం ఏంటో తెలుసా …….. …. పెళ్లి చూపులు చిత్రాన్ని బాలీవుడ్ లో ” మిత్రోం ” పేరుతో రీమేక్ చేసారు , కాగా ఆ చిత్ర ట్రైలర్ తాజాగా విడుదల అయ్యింది అయితే ఆ ట్రైలర్ చూస్తుంటే ఎక్కడ కూడా తరుణ్ భాస్కర్ పేరు లేకపోగా రిషబ్ హాష్మి అనే పేరు ని రచయితగా వేసారు . అసలు పెళ్లి చూపులు ఒరిజినల్ రైటర్ తరుణ్ భాస్కర్ కాబట్టి ఆ సినిమా హక్కులు తీసుకొని బాలీవుడ్ లో రీమేక్ చేస్తున్నారు కాబట్టి కథ క్రెడిట్ తప్పకుండా తరుణ్ భాస్కర్ కు ఇవ్వాలి కానీ టైటిల్స్ లో ఎక్కడా తరుణ్ భాస్కర్ పేరు లేదు దాంతో ఇది అన్యాయం అంటూ కొంతమంది ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు .

విజయ్ దేవరకొండ హీరోగా నటించగా తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో తెరకెక్కిన పెళ్లి చూపులు చిత్రంతో దర్శకుడిగా పరిచయమయ్యాడు . జాతీయ స్థాయి అవార్డ్ ని సైతం అందుకున్నాడు తరుణ్ భాస్కర్ కానీ రీమేక్ చేసిన వాళ్ళు ఇలా క్రెడిట్ ఇవ్వకపోవడం మాత్రం దారుణం . మరి ఈ విషయం పై ఇరు వర్గాలు ఎలా స్పందిస్తాయో చూడాలి .

English Title: No credits to director Tharun bhascker