మహేష్ చిత్రాన్ని కొనడానికి భయపడుతున్నారట


No deal for mahesh babu's maharshi overseas rights
Mahesh Babu

మహేష్ బాబు టాలీవుడ్ సూపర్ స్టార్ అన్న విషయం తెలిసిందే , దానికి తోడు ఓవర్ సీస్ లో అందరి హీరోల కంటే మహేష్ బాబు చిత్రాలకే ఆదరణ ఎక్కువగా ఉండేది కానీ సీన్ రివర్స్ అయ్యింది గతకొంత కాలంగా మహేష్ చిత్రాలకు భారీగానే వసూళ్లు వస్తున్నాయి కానీ పెట్టిన పెట్టుబడిని మాత్రం తిరిగి రాబట్టలేకపోతున్నాయి దాంతో తాజాగా మహేష్ నటిస్తున్న మహర్షి చిత్రాన్ని ఓవర్ సీస్ లో కొనడానికి భయపడుతున్నారట . ఇప్పటికే మహర్షి చిత్రం శాటిలైట్ హక్కులు, డిజిటల్ రైట్స్ అమ్ముడు పోయాయి కానీ ఓవర్ సీస్ హక్కులు మాత్రం ఇంకా అమ్ముడు పోలేదు .

 

వంశీ పైడిపల్లి దర్శకత్వంలో దిల్ రాజు , అశ్వనీదత్ , పివిపి లు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు . ఇప్పటికే 70 శాతానికి పైగా షూటింగ్ పార్ట్ పూర్తిచేసుకున్న ఈ మహర్షి చిత్రాన్ని 2019 ఏప్రిల్ 5 న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు . అయితే ఓవర్ సీస్ లో ఈ సినిమాని ఇంకా కొనకపోవడంతో ట్రేడ్ విశ్లేషకులు సైతం ఆశ్చర్యానికి లోనౌతున్నారు .

English Title: No deal for mahesh babu’s maharshi overseas rights