రూలర్, వరల్డ్ ఫేమస్ లవర్ సినిమాలు కొనడానికి ఎవరూ ముందుకు రావట్లేదేంటి?


రూలర్, వరల్డ్ ఫేమస్ లవర్ సినిమాలు కొనడానికి ఎవరూ ముందుకు రావట్లేదేంటి?
రూలర్, వరల్డ్ ఫేమస్ లవర్ సినిమాలు కొనడానికి ఎవరూ ముందుకు రావట్లేదేంటి?

సంక్రాంతికి పెద్ద సినిమాలు వస్తుండడంతో మీడియం బడ్జెట్ చిత్రాలన్నీ డిసెంబర్ ను టార్గెట్ చేస్తున్నాయి. ఇప్పటికే సాయి ధరమ్ తేజ్ ప్రతిరోజూ పండగే క్రిస్మస్ కు వస్తున్నట్లు ప్రకటించిన విషయం తెల్సిందే. రవితేజ డిస్కో రాజా కూడా అదే సీజన్ లో రానుంది. నందమూరి బాలకృష్ణ నుండి వస్తున్న రూలర్ కూడా క్రిస్మస్ కే వస్తుంది అంటున్నారు. అయితే దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. విజయ్ దేవరకొండ లేటెస్ట్ చిత్రం వరల్డ్ ఫేమస్ లవర్ కూడా డిసెంబర్ లోనే రిలీజ్ కానుంది.

అయితే ఈ చిత్రాల ఓవర్సీస్ హక్కుల విషయానికి వస్తే.. ప్రతిరోజూ పండగే చిత్రాన్ని మారుతి సొంతంగా విడుదల చేసుకుంటున్నాడు. డిస్కో రాజా చిత్రానికి కూడా డీసెంట్ ప్రైస్ వచ్చింది. ఈ చిత్రాన్ని సరిగమ సినిమాస్ ఓవర్సీస్ లో పంపిణీ చేయనుంది. ఇంతవరకూ బానే ఉన్నా రూలర్, వరల్డ్ ఫేమస్ లవర్ చిత్రాలను కొనడానికి ఎవరూ ముందుకు రాకపోవడం ఆశ్చర్యకరంగా మారింది.

నందమూరి బాలకృష్ణకు ముందు నుండీ ఓవర్సీస్ లో మార్కెట్ తక్కువే. పైగా ఇప్పుడు ఓవర్సీస్ లో తెలుగు సినిమాల పరిస్థితి అంత ఆశాజనకంగా లేదు. రూలర్ విషయానికి వస్తే బాలయ్య తప్ప సెల్లింగ్ పాయింట్ మరొకటి లేకపోవడంతో బయ్యర్లు ఆలోచిస్తున్నారు. ఇదిలా ఉంటే విజయ్ దేవరకొండ సినిమాను కొనడానికి ఎందుకు ఆసక్తి చూపించట్లేదు అన్నది అర్ధం కావడం లేదు. ఎక్కువ రేటుకు వరల్డ్ ఫేమస్ లవర్ నిర్మాతలు కోట్ చేస్తుండటమే దీనికి కారణం అంటున్నారు. మరి చూడాలి విడుదలకు ముందు లోగా ఎవరు ఈ చిత్రాలను కొంటారో.