బిగ్ బాస్ 4: ఈ వీక్ నో ఎలిమినేషన్బిగ్ బాస్ 4: ఈ వీక్ నో ఎలిమినేషన్
బిగ్ బాస్ 4: ఈ వీక్ నో ఎలిమినేషన్

అనుకున్నట్లుగానే బిగ్ బాస్ సాగుతోంది. ఇంకా షో ఫైనల్ ఎపిసోడ్ కు మూడు వారాలు ఉండగా షో లో మాత్రం ఏడుగురు కంటెస్టెంట్స్ ఉండడంతో ఒకరోజు కచ్చితంగా ఎలిమినేషన్ ఉండదని కచ్చితంగా తేల్చేసారు సమీక్షకులు. దానికి తగ్గట్లుగానే ఈ వీకెండ్ ఎపిసోడ్ నడిచినట్లు తెలుస్తోంది.

శనివారం ఎపిసోడ్ లో ఫుల్ ఫైర్ లో ఉన్న నాగార్జున, ఆదివారం ఎపిసోడ్ ఫుల్ ఫన్ డేగా మార్చేసినట్లు ప్రోమో చూస్తే తెలుస్తోంది. ఈ ఆదివారం ఎపిసోడ్ కు సుదీప్ గెస్ట్ గా విచ్చేసారు. నిన్న మోనాల్ సేవ్ అవ్వగా ఇంకా నామినేషన్స్ లో ముగ్గురు ఉన్నారు. అఖిల్, అరియనా, అవినాష్ లు ఎలిమినేషన్ ను ఫేస్ చేస్తున్నారు.

వోటింగ్ తక్కువగా రావడంతో నిజానికి అవినాష్ ఎలిమినేట్ అవ్వాలి కానీ తన దగ్గర ఎవిక్షన్ ఫ్రీ కార్డు ఉండడంతో దాన్ని ఉపయోగించుకుని సేవ్ అయినట్లు తెలుస్తోంది. దీంతో ఈ వారం నో ఎలిమినేషన్ వీకెండ్. ఇక మిగిలి ఉన్న రెండు వారాలకు ఇద్దరు ఎలిమినేట్ అవుతారు. అదీ సంగతి.