ఆ నాలుగు చిత్రాల్లో హిట్ కొట్టేది ఎవరో ?


no hopes on 4 movies

రేపు నాలుగు చిత్రాలు విడుదల అవుతున్నాయి అయితే ఆనాలుగు చిత్రాలపై పెద్దగా ఆసక్తి లేదు పైగా అన్ని కూడా చిన్న చిత్రాలే కావడం గమనార్హం. ఇంతకీ రేపు విడుదల అవుతున్న నాలుగు చిత్రాలు ఏంటో తెలుసా…….. రష్మీ నటించిన రొమాంటిక్ హర్రర్ చిత్రం అంతకుమించి , ఆది పినిశెట్టి , తాప్సి, రితికా సింగ్ నటించిన నీవెవరో , ప్రభుదేవా నటించిన లక్ష్మీ, జగపతిబాబు , నారా రోహిత్ నటించిన ఆటగాళ్లు . ఈ నాలుగు చిత్రాల్లో కాస్త ఆశలు , అంచనాలు ఉన్నది నీవెవరో చిత్రం పై మాత్రమే . మిగతా చిత్రాలపై పెద్దగా ఆశలు లేవు , అంచనాలు అంతకంటే లేవు.

ప్రస్తుతం విజయ్ దేవరకొండ బాక్సాఫీస్ ని దున్నేస్తున్నాడు గీత గోవిందం చిత్రంతో . కాబట్టి ఈ సినిమాలు ఎంతవరకు ప్రభావం చూపుతాయో పెద్దగా చెప్పలేం . ఒకవేళ హిట్ అనిపించుకున్నా భారీ హిట్ కొట్టే స్థాయి అయితే ఏ చిత్రానికి లేదు. రష్మీ నటించిన అంతకుమించి గ్లామర్ షో అని తేలిపోయింది ఏమైనా కంటెంట్ ఉంటే ఆడుతుంది లేదంటే ఊసులో లేకుండా పోతుంది. ఏదైనా మిరాకిల్ జరిగితే కానీ తెలీదు లేదంటే ఈ వారం వచ్చే చిత్రాల్లో విజయం సాధించే బాపతు అయితే ఏది కనిపించడం లేదు. గీత గోవిందం మాత్రం ఇంకా భారీ వసూళ్లు సాధిస్తూనే ఉన్నాడు.

English Title: no hopes on 4 movies