సూర్య సినిమాకు మళ్ళీ అదే తప్పు చేస్తున్నారే


Bandobast
Bandobast

కొన్నేళ్ల క్రితం సూర్యకు తెలుగులో భారీ మార్కెట్ ఉండేది. ఘజినితో మొదలైన సూర్య హవా ఇక్కడ సింగం సిరీస్ లకు కూడా బానే ఉపయోగపడింది. అయితే ఇటీవలే సూర్య మార్కెట్ పూర్తిగా డౌన్ అయిపోయింది. కథల ఎంపికలో చేస్తున్న పొరపాట్లు కొన్నైతే ఇక్కడ సినిమాను సరిగ్గా ప్రమోట్ చేయక ప్లాప్ అయిన సినిమాలు మరికొన్ని. అయితే వచ్చే వారం విడుదల కానున్న సూర్య సినిమా పరిస్థితి మరీ అధ్వాన్నంగా ఉంది.

బందోబస్త్ పేరుతో విడుదలవుతున్న సూర్య తర్వాతి సినిమాకు తెలుగులో కనీస హైప్ లేదు. అసలు ఇలాంటి సినిమా ఒకటి విడుదలవుతోన్న సంగతి కూడా సగటు సినీ ప్రేక్షకుడికి తెలియదంటే అతిశయోక్తి కాదు.

తెలుగు నిర్మాతలు హైప్ రావడం కోసం కనీస ప్రయత్నాలు కూడా చేయకపోవడం విచారకరం. ఒకప్పుడు తెలుగులో 10 కోట్ల షేర్ సాధించిన సూర్య ఇప్పుడు మినిమం ఓపెనింగ్స్ కోసం ఆరాటపడుతున్నారు. మరి బందోబస్త్ కోసం ప్రచార కార్యక్రమాలు ఏమైనా మొదలెడతారేమో చూడాలి.