ఎఫ్ 3 లో మహేష్.. క్లారిటీ ఇచ్చేయండి బాసూఎఫ్ 3 లో మహేష్.. క్లారిటీ ఇచ్చేయండి బాసూ
ఎఫ్ 3 లో మహేష్.. క్లారిటీ ఇచ్చేయండి బాసూ

సూపర్ స్టార్ మహేష్ బాబు రీసెంట్ గా సరిలేరు నీకెవ్వరు చిత్రంతో సూపర్ డూపర్ హిట్ ను అందుకున్న విషయం తెల్సిందే. ఈ చిత్రాన్ని కామెడీ చిత్రాలకు పేరు పొందిన అనిల్ రావిపూడి తెరకెక్కించాడు. అనిల్ కామెడీ టైమింగ్ కు ఫిదా అయిపోయిన మహేష్ అనిల్ కు మరో సినిమా ఛాన్స్ కూడా ఇచ్చేసాడు. అయితే అనిల్ కు అప్పటికే ఒక సినిమా కమిట్మెంట్ ఉండడం వల్ల మహేష్ తో మరో సినిమాకు ఏడాదిన్నరకు పైగా పట్టే అవకాశాలున్నాయి. మహేష్, అనిల్ రావిపూడి ఈలోగా చెరొక సినిమా చేసి మళ్ళీ కలిసి పనిచేద్దామని భావించారు.

మహేష్ బాబు తదుపరి సినిమాపై ఇంకా క్లారిటీ రావలసి ఉంది. వంశీ పైడిపల్లితో అనుకున్నారు కానీ అది కాదని వార్తలు వస్తున్నాయి. దీనిపై మరింత క్లారిటీ మరో నెల రోజులు ఆగితే వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇక అనిల్ రావిపూడి ఎఫ్ 2 సీక్వెల్ పనులు మొదలుపెట్టాడు అన్నది తెలిసిన విషయమే. ఎఫ్ 2 బ్లాక్ బస్టర్ అయిన నేపథ్యంలో దాన్ని మించేలా సీక్వెల్ ఉండాలి. లేదంటే మొదటికే మోసం వస్తుంది. అందుకే అనిల్ రావిపూడి ఈసారి అసలు గురి మిస్ అవ్వకూడదన్న టార్గెట్ తో పనిచేస్తున్నాడు.

ఎఫ్ 2 సీక్వెల్ కు ఎఫ్ 3 అన్న టైటిల్ ను ఫిక్స్ చేసారు. ఈ సినిమాలో మహేష్ బాబు ఒక కీలక పాత్రలో కనిపిస్తాడని, సెకండ్ హాఫ్ లో వచ్చే ఈ పాత్ర సినిమా మొత్తం ఉంటుందని గత కొద్ది రోజులుగా వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో మహేష్ పాత్ర ఎలా ఉంటుందా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూసారు. అయితే తాజా సమాచారం ప్రకారం ఆ వార్తలు ఒట్టి పుకార్లేనని తేలింది. అసలు ఎఫ్ 3 లో మరో హీరో ఉంటాడన్నది రూమర్ అని, కథలో ఆ రకమైన స్కోప్ లేదని అనిల్ రైటర్స్ టీమ్ నుండి అందిన సమాచారం. ఏదేమైనా మరో నెల, రెండు నెలల్లో ఈ విషయమ్మీద పూర్తి క్లారిటీ వచ్చేస్తుంది.