మహేష్, త్రివిక్రమ్ కు పూర్తిగా చెడిపోయినట్టేనా?

No More Good relations between Trivikram Srinivas and Mahesh Babu
No More Good relations between Trivikram Srinivas and Mahesh Babu

సూపర్ స్టార్ మహేష్ బాబు కెరీర్ లో రెండు అత్యంత ముఖ్యమైన సినిమాలుగా అతడు, ఖలేజాలను పరిగణించవచ్చు. ఈ సినిమాలు రెండూ మహేష్ ను నటుడిగా మరో మెట్టు ఎక్కించాయి. అతడు సినిమాతో తన కెరీర్ లో క్లాసిక్ ను అందుకున్నాడు మహేష్. ఇప్పటికీ ఈ సినిమాకు అదిరిపోయే టిఆర్పి వస్తుంది. ఇప్పటికే వందసార్లకు పైగా టివిలో అతడు టెలికాస్ట్ అయింది. అయినా దానికి క్రేజ్ తగ్గలేదు. ఒక కల్ట్ స్టేటస్ ను అందుకుంది అతడు. అలాగే ఖలేజా సినిమా మహేష్ కెరీర్ లో టర్నింగ్ పాయింట్. ఈ సినిమాకు ముందు మూడేళ్లు తన కెరీర్ లో గ్యాప్ వచ్చింది. పైగా నటుడిగా పూర్తిగా ట్రాన్స్ఫార్మ్ అయ్యాడు మహేష్. మహేష్ కెరీర్ లో ఖలేజాకు ముందు, తర్వాతగా డివైడ్ చేయవచ్చు. అలాంటి రెండు ఇంపార్టెంట్ సినిమాలను మహేష్ కు అందించాడు త్రివిక్రమ్ శ్రీనివాస్. అందుకే మహేష్ కు త్రివిక్రమ్ అంటే చాలా రెస్పెక్ట్. ఇప్పటికే చాలాసార్లు మూడోసారి ఇద్దరూ కలిసి పనిచేయాలని అనుకున్నా కానీ ఎందుకో సెట్ అవ్వలేదు. మైత్రి మూవీస్ బ్యానర్ లో ఇద్దరూ కలిసి ఒక సినిమా చేయాల్సి ఉండేది. కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల అది పోస్ట్ పోన్ అయింది. ఇద్దరూ కలిసి సినిమా చేయకపోయినా మహేష్ నటించిన చాలా యాడ్లకు త్రివిక్రమ్ దర్శకత్వం వహించాడు. ఆ రకంగా ఇద్దరూ క్లోజ్ గా ఉండేవాళ్ళు. కొన్నేళ్ల క్రితం తుఫాను బాధితుల సహాయార్ధం టాలీవుడ్ అంతా కలిసివచ్చి చేసిన మేము సైతం కార్యక్రమంలో మహేష్, త్రివిక్రమ్ కలిసి ఒక ఇంటర్వ్యూ కూడా చేసారు. ఆ సందర్భంగా ఇద్దరూ ఎంత క్లోజ్ అనేది ప్రేక్షకులకు కూడా అర్ధమైంది.

చూస్తుంటే ఇప్పుడు ఇద్దరి మధ్యా బాగా గ్యాప్ వచ్చినట్లు అనిపిస్తోంది. రీసెంట్ గా జరిగిన వ్యవహారాల బట్టి త్రివిక్రమ్ తో మహేష్ కు పూర్తిగా చెడిపోయిందా అనే భావన కూడా కలుగుతోంది. అల వైకుంఠపురములో, సరిలేరు నీకెవ్వరు చిత్రాలు ఒకేరోజు విడుదల కానుండడం దీనికి ప్రధాన కారణంగా తెలుస్తోంది. ముఖ్యంగా మహేష్, అల వైకుంఠపురములో టీమ్ కావాలనే సంక్రాంతికి తమకు అడ్డం వచ్చారని ఫీల్ అవుతున్నాడట. సరిలేరు నీకెవ్వరు జనవరి 12న విడుదలవుతోంది అని తెలుసుకునే ముందే అల వైకుంఠపురములో రిలీజ్ డేట్ ప్రకటించిందిట. ఇలా కావాలని తనకు అడ్డం వస్తుండడంతో మహేష్ కూడా గుస్సాగా ఉన్నట్లు తెలుస్తోంది. అక్కడ త్రివిక్రమ్ ఉండి కూడా ఏం చేయకపోవడం మహేష్ కు మరింత ఆగ్రహం తెప్పించిందిట. నిజానికి అల వైకుంఠపురములో కు సంబంధించి రిలీజ్ డేట్, సాంగ్ రిలీజ్, ట్రైలర్ రిలీజ్ వంటి వాటి విషయాల్లో త్రివిక్రమ్ ప్రమేయం దాదాపు శూన్యమేనట.అయినా కానీ త్రివిక్రమ్ తనతో సంప్రదించకపోవడంపైనే మహేష్ పాయింట్ అవుట్ చేస్తున్నాడట.

ఈ రకంగా ఇద్దరికీ ఇక తెగిపోయినట్లేనని ఇండస్ట్రీలో గుసగుసలాడుకుంటున్నారు. త్రివిక్రమ్ తో తన 28వ సినిమాను ప్లాన్ చేసిన మహేష్ ఇప్పుడు ఆ ప్రయత్నాలను కూడా విరమించుకుంటున్నాడట.