ఇప్పుడ‌ప్పుడే పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదు!


ఇప్పుడ‌ప్పుడే పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదు!
ఇప్పుడ‌ప్పుడే పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదు!

ఇప్పుడ‌ప్పుడే త‌న‌కు పెళ్లి చేసుకునే ఉద్దేశం లేద‌ని అంటున్నాడు మెగా మేన‌ల్లుడా సాయి ధ‌ర‌మ్‌తేజ్‌. టాలీవుడ్‌లో లాక్‌డౌన్ ఇటీవ‌ల వ‌రుస పెళ్లిళ్లతో స్టార్‌లు షాకుల మీద షాకులిస్తున్న విష‌యం తెలిసిందే. దిల్ రాజు నుంచి రానా వ‌రకు వ‌రుస పెళ్లిళ్ల‌తో టాలీవుడ్ క‌ళ్యాణ కాంతుళీనుతోంది. తాజాగా మ‌రో ఇద్ద‌రు పెళ్లికి సిద్ధ‌మ‌వుతున్న‌ విష‌యం తెలిసిందే.

మెగా డాట‌ర్ నిహారిక పెళ్లికి రెడీ అవుతుంటే కాజ‌ల్ అగ‌ర్వాల్ ఈ 30న ముంబైలో గౌత‌మ్ కిచ్లూని వివాహం చేసుకోబోతోంది. ఇదిలా వుంటే మెగా హీరో సాయిధ‌ర‌మ్‌తేజ్ కూడా పెళ్లి దారి ప‌డుతున్నార‌ని గ‌త కొన్ని రోజులుగా వార్త‌లు షికారు చేస్తున్న విష‌యం తెలిసిందే. ఇప్ప‌టికే త‌న చిన్న‌నాటి స్నేహితురాలిని వివాహం చేసుకోవ‌డానికి రెడీ అయిపోతున్నాడంటూ వ‌రుస క‌థ‌నాలు వినిపిస్తున్నాయి.

అయితే ఆ వార్త‌ల్లో నిజం లేద‌ని చెబుతున్నాడు సాయి ధ‌ర‌మ్‌తేజ్‌, ఇప్పుడ‌ప్పుడే త‌న‌కు పెళ్లి చేసుకునే ఉద్దేశం లేద‌ని స్ప‌ష్టం చేస్తున్నాడు. త‌న‌కు త‌గిన వ‌ధువుని చూస్తానంటే కుటుంబ స‌భ్యులకు ఓకే చెప్పాన‌ని అయితే నా పెళ్లి విష‌యంలో మీడియా ప్ర‌త్యేక ఆస‌క్తి చూపిస్తోంద‌ని, దాని వ‌ల్లే పెళ్లి వార్త‌లు ఎక్కువ‌గా పుట్టుకొస్తున్నాయ‌ని చెప్పుక‌చ్చాడు.