అఖిల్ తో సినిమా అంటే భయపడుతున్నారా ?


No producer for Akhil next

అక్కినేని అఖిల్ హీరోగా నటించిన మూడు చిత్రాలు కూడా ప్లాప్ అయ్యాయి దాంతో అఖిల్ తదుపరి చిత్రానికి నిర్మాత లేకుండాపోయాడు . అఖిల్ తాజాగా నటించిన మిస్టర్ మజ్ను చిత్రం కూడా ప్లాప్ కావడంతో అఖిల్ తదుపరి చిత్రం డైలమాలో పడింది . అఖిల్ తన తదుపరి చిత్రాన్ని సత్య అనే యువ దర్శకుడితో చేయడానికి ప్లాన్ చేసాడు కానీ ఆ సినిమాకు నిర్మాత ఎవరు ? అన్నది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది .

 

అఖిల్ ని హీరోగా నిలబెట్టాలి అది నాగార్జున బాధ్యత అందుకే తను పెట్టుబడులు పెట్టకుండా మరో నిర్మాత కోసం చూస్తున్నాడట నాగ్ . అయితే ఎవరూ ముందుకు రాకపోతే మళ్ళీ నాగార్జునే సినిమా నిర్మించాలి తప్పదు కదా ! కాకపోతే నిర్మాత ఎవరూ రాకపోతే అప్పుడు రిస్క్ చేయాలనీ భావిస్తున్నాడట నాగార్జున .

 

English Title: No producer for Akhil next