టాక్ బాగుంది కానీ కలెక్షన్లు అంతంత మాత్రమే !


నాని నటించిన జెర్సీ చిత్రానికి ఇక్కడ అలాగే ఓవర్ సీస్ లో కూడా టాక్ బ్రహ్మాండంగా ఉంది కానీ వసూళ్లు మాత్రం ఆ స్థాయిలో రావడం లేదు . ఇక ఓవర్ సీస్ లో అయితే మరీ దారుణంగా ఉంది పరిస్థితి . పేరుకి వన్ మిలియన్ డాలర్లని అధిగమించింది కానీ బయ్యర్లకు మాత్రం లాభాలు వచ్చేలా కనిపించడం లేదు . ఇప్పటికే అన్ని ఖర్చులు కలుపుకొని తడిసి మోపెడు అయ్యింది దాంతో లాభాలు రాకపోయినా ఫరవాలేదు నష్టాలు మాత్రం వద్దు అని వేడుకుంటున్నారట .

అయితే ఓవరాల్ గా జెర్సీ ఓవర్ సీస్ బయ్యర్లకు నష్టాలను మాత్రం మిగల్చదు ఎందుకంటే ఇప్పటికే వన్ మిలియన్ డాలర్లని వసూల్ చేసింది . పైగా మరో తెలుగు సినిమా ఇప్పట్లో వచ్చేది లేదు కాబట్టి మరో వారం రోజుల్లో బయ్యర్లు పెట్టిన ప్రతీ పైసా తిరిగి రాబట్టడం ఖాయమని భావిస్తున్నారు కాకపోతే ఓ మంచి సినిమాని రిలీజ్ చేసాం అని సంతృప్తి చెందడం మినహా లాభాలు అయితే వచ్చేట్లు కనిపించడం లేదు . అయితే తెలుగు రాష్ట్రాలలో మాత్రం బయ్యర్లకు లాభాలు వస్తున్నాయి .