దిల్ రాజు.. సైలెంట్ గా ఉంటున్నాడేంటి?


దిల్ రాజు.. సైలెంట్ గా ఉంటున్నాడేంటి?
దిల్ రాజు.. సైలెంట్ గా ఉంటున్నాడేంటి?

దిల్ రాజు.. టాలీవుడ్ లో టాప్ ప్రొడ్యూసర్. ఆ నలుగురుగా ఇండస్ట్రీలో పేర్కొనబడే వ్యక్తుల్లో దిల్ రాజు కూడా ఒకరు. డిస్ట్రిబ్యూటర్ గా, ఎగ్జిబిటర్ గా, నిర్మాతగా దిల్ రాజు ప్రయాణం ఎత్తుపల్లాలు ఉన్నా సాఫీగానే సాగిపోయిందని చెప్పాలి. దిల్ రాజు సినిమాలంటే మినిమం గ్యారంటీ అనే ఒపీనియన్ జనాల్లో బాగా నాటుకుపోయింది. ఆయన జడ్జ్మెంట్ ఆన్ ది స్పాట్ గా ఉంటుందని ఇండస్ట్రీలో పేరుంది. దిల్ రాజు మొదట్లో ఎక్కువగా చిన్న, మీడియం బడ్జెట్ సినిమాలపైనే తన ఫోకస్ అంతా పెట్టాడు. నిజానికి దిల్ రాజుకు భారీ లాభాలు తీసుకొచ్చేది కూడా అవే. కానీ తన ఉనికిని కాపాడుకోవడం కోసం ఈయన పెద్ద సినిమాలపై ఆసక్తి చూపిస్తుంటాడు. పెద్ద సినిమాలైతే ఇండస్ట్రీపై తనకు గ్రిప్ ఉంటుందన్నది దిల్ రాజు భావన. అందుకే ఏడాదికి ఒక్కటైనా పెద్ద సినిమా నిర్మిస్తుంటాడు.

అయితే ఈ మధ్య దిల్ రాజు కొంచెం డల్ అయినట్లు కనిపిస్తోంది. పెద్ద సినిమాలు చేస్తున్నా అందులో డైరెక్ట్ భాగస్వామ్యం లేదు. అందుకే అవి దిల్ రాజుకు పూర్తి సంతృప్తిని ఇవ్వట్లేదు. ఈ మధ్య సినిమాలన్నీ ఎక్కువగా భాగస్వామ్యంతో తెరకెక్కుతున్నవే ఉంటున్నాయి. దీని వల్ల నిర్మాతలకు రిస్క్ తగ్గుతుందన్నది వారి భావన. ఇదిలా ఉంటే చిన్న సినిమాలు కూడా దిల్ రాజు ఆశించిన రేంజ్ లో సక్సెస్ కావట్లేదు. ఈ నేపథ్యంలో దిల్ రాజు రీసెంట్ గా నిర్మించిన సినిమా ఇద్దరి లోకం ఒకటే. రాజు తరుణ్, అర్జున్ రెడ్డి ఫేమ్ షాలిని పాండే ఈ సినిమాలో హీరో, హీరోయిన్లుగా నటించారు. షూటింగ్ ఎప్పుడు మొదలైందో, ఎప్పుడు పూర్తి చేసారో కూడా తెలీదు. అంతా గుట్టుగా జరిగిపోయింది. కట్ చేస్తే ఇప్పుడు ఈ సినిమాకు సెన్సార్ కూడా పూర్తయింది. యూ/ఏ సర్టిఫికేట్ తెచ్చుకుంది.

సెన్సార్ అయితే అయింది కానీ ఈ సినిమా రిలీజ్ డేట్ విషయంలో ఇంకా క్లారిటీ రాలేదు. క్రిస్మస్ రోజున విడుదల చేద్దామని ముందు భావించాడు దిల్ రాజు. డిసెంబర్ 20న ప్రతిరోజూ పండగే, రూలర్ సినిమాలు విడుదలవుతున్నా ఐదు రోజులు గ్యాప్ ఉంటుంది పైగా న్యూ ఇయర్ ఈవ్ కూడా కలిసొస్తుందని డిసెంబర్ 25 పెర్ఫెక్ట్ అనుకున్నాడు. అయితే ఇప్పుడు అదే రోజున వెంకీ మామ విడుదలవుతుంది అన్న వార్తలు వస్తున్నాయి. మూడు క్రేజ్ ఉన్న సినిమాలు విడుదలైతే ఇద్దరి లోకం ఒకటే వంటి చిన్న సినిమా రావడానికి స్కోప్ ఉండదు. అందుకే డిసెంబర్ 13 అయినా విడుదల చేద్దామా అని అనుకుంటున్నాడు.

రిలీజ్ డేట్ సంగతి పక్కనపెడితే దిల్ రాజు ఈ సినిమాకు కనీస ప్రమోషన్ కూడా చేయకపోవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. ఈ సినిమా నుండి ఇప్పటివరకూ పాటలు విడుదలైనా అవి ప్రేక్షకులకు తెలిసింది తక్కువే. సెన్సార్ సర్టిఫికేట్ వచ్చినా కానీ ఇంకా ప్రమోషన్స్ ఏ మాత్రం లేకపోవడం టీమ్ కు ఆందోళన కలిగిస్తోంది. దిల్ రాజు అంటే ప్రమోషన్స్ కు పెట్టింది పేరు. మరి రాజ్ తరుణ్ సినిమా విషయంలో ఎందుకిలా జరుగుతోంది.