యాత్ర కు పబ్లిసిటీ చేయడమే లేదు


No publisity for Yatra film

కీర్తిశేషులు వై ఎస్ రాజశేఖర్ రెడ్డి బయోపిక్ గా తెరకెక్కుతున్న యాత్ర చిత్రానికి పెద్దగా పబ్లిసిటీ చేయడమే లేదు ఆ చిత్ర బృందం . సినిమా హిట్ అవుతుందని గట్టి నమ్మకమా ? లేక ఎలాగూ పోయే సినిమాకు ప్రచారం ఖర్చులు ఎందుకు దండగ అని అనుకుంటున్నారో ఏమో  కానీ ఎల్లుండి రిలీజ్ కానీ వాళ్లకు మాత్రం అంతగా పట్టింపు లేకుండా పోయింది కాకపోతే ఏదో తూ తూ మంత్రంగా చేస్తున్నారు.

 

మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి నటించిన ఈ చిత్రంలో హాట్ భామ అనసూయ , జగపతిబాబు కీలక పాత్రల్లో నటించారు . పాదయాత్ర  ప్రజల కష్టసుఖాలు తెలుసుకొని వాళ్ళ ఆదరాభిమానాలను పొంది ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు స్వీకరించే వరకు ఈ సినిమా సాగనుంది . ఈనెల 8 న యాత్ర విడుదల అవుతోంది . అయితే పెద్దగా ప్రచారం మాత్రం చేయడం లేదు ఆ చిత్ర బృందం .

English Title: No publisity for Yatra film