పవన్ పైసా కూడా తీసుకోవడం లేదట !!!


No remuneration for pawan kalyan
No remuneration for pawan kalyan

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వెండితెరపై ఎప్పుడు దర్శనమిస్తాడా..అని మెగా అభిమానులు కోటి ఆశలతో ఎదురుచూస్తున్నారు. అయితే చాలా వరకు అభిమానులకు పవర్ స్టార్ పింక్ రీమేక్ చేస్తుండడం నచ్చడం లేదు. పవన్ అంత రిస్క్ చేయడం అవసరమా అని కామెంట్స్ వస్తున్నాయి. పైగా అనుబవం లేని  డైరెక్టర్ చేతుల్లో పవర్ స్టార్ కమ్ బ్యాక్ ఫిల్మ్ ని పెట్టడం ఎంతవరకు కరెక్ట్ అనే కామెంట్స్ కూడా చేస్తున్నారు.

అసలు మ్యాటర్ లోకి వస్తే.. సినిమాలో నటించడానికి ఒప్పుకున్న పవన్ ఈ ప్రాజెక్ట్ కి రెమ్యునరేషన్ ఎంత తీసుకుంటున్నాడు అనేది హాట్ టాపిక్ గా మారింది. అయితే నిర్మాతలు దిల్ రాజు – బోణి కపూర్ ఒక చర్చతో పవన్ కి సానుకూలంగా ఉండే సలహా ఇచ్చినట్లు తెలుస్తోంది. పవన్ పింక్ రీమేక్ కి రూపాయి కూడా తీసుకోవడం లేదట. అయితే వచ్చిన కలెక్షన్స్ లో షేర్స్ తీసుకుంటే బెటర్ అని ఒప్పందం కుదుర్చుకున్నట్లు తెలుస్తోంది.
సినిమా బిజినెస్ లో ఏవైనా హక్కుల రూపంలో గాని ఏరియాల నుంచి వచ్చే లాభాల్లో షేర్స్ తీసుకోవాలని ఒక సలహా ఇచ్చారట. పవన్ కూడా పెద్దగా  డిమాండ్ చేయకుండా ఈ డీల్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. అజ్ఞాతవాసి డిజాస్టర్ అయినప్పటికి పవన్ సినిమా మార్కెట్ పై ఎలాంటి ప్రభావం పడలేదని తెలుస్తోంది. ఆయనతో సినిమా చేయడానికి చాలా మంది నిర్మాతలు ప్రయత్నాలు చేస్తున్నారు. మొత్తానికి దిల్ రాజు సెట్ చేసుకున్నారు. మరి పింక్ రీమేక్ ఎంతవరకు సక్సెస్ అవుతుందో చూడాలి.