బాలయ్య సినిమాకు ఒక హీరోయిన్ ను కట్ చేసేశారా?


 

No second heroine in balayya boyapati flick
No second heroine in balayya boyapati flick

నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం తన కెరీర్ లో క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటున్నాడు. గతేడాది మూడు వరస డిజాస్టర్లతో కెరీర్ లో డౌన్ ఫాల్ చూసిన బాలయ్య ఈసారి ఎలాగైనా హిట్ కొట్టి విమర్శకుల నోళ్లు మూయించాలని అనుకుంటున్నాడు. ఇందుకోసం తనకు అచొచ్చిన దర్శకుడు బోయపాటి శ్రీనుతో జత కట్టిన విషయం తెల్సిందే. బోయపాటి శ్రీను కూడా వినయ విధేయ రామ చిత్రంతో విమర్శల పాలయ్యాడు. ముఖ్యంగా కంటెంట్ విషయంలో బోయపాటి చాలా ట్రోల్స్ ఎదుర్కోవాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలో వీరిద్దరూ కలిసి కసిగా పనిచేస్తున్నారు.

అయితే ప్లాపుల్లో ఉన్న ఇద్దరికీ బడ్జెట్ సమస్యలు ఎదురైన విషయం తెల్సిందే. చిత్రాన్ని ప్రాఫిటబుల్ చేయాలంటే పరిమిత బడ్జెట్ లోనే చిత్రాన్ని పూర్తి చేయాలన్న నిర్ణయానికి వచ్చారు. ఇందుకోసం ఇద్దరూ తమ తమ పారితోషికాలను బాగా తగ్గించేసుకున్నారు. ఇంకా షూటింగ్ లొకేషన్స్, హీరోయిన్స్, ఇతర నటీనటుల విషయంలో తక్కువ పారితోషికానికి వచ్చే బెస్ట్ నటీనటులను పెట్టుకోవాలని నిశ్చయించుకున్నారు. అనవసర హంగులకు పోయి బాలీవుడ్ వాళ్ళను దించి బడ్జెట్ పెంచకూడదని అనుకున్నారు. ఈ కారణాల వల్ల మొదట 70 కోట్లు అనుకున్న బడ్జెట్ కాస్తా ఇప్పుడు 50 కోట్లకు చేరుకుంది. దీంతో పాటు ఇప్పుడు బోయపాటి శ్రీను మరో ఆసక్తికర నిర్ణయాన్ని తీసుకున్నట్లు తెలుస్తోంది.

సాధారణంగా బాలయ్య సినిమా అంటే ఇద్దరు లేదా ముగ్గురు హీరోయిన్లు తప్పనిసరి. చాలా సంవత్సరాల నుండి ఇదే జరుగుతోంది. ఇక బోయపాటి శ్రీను రీసెంట్ సినిమాల్లో కూడా ఇదే తంతు కనిపిస్తోంది. వీరిద్దరూ కలిసి చేయనున్న సినిమాకు కూడా మొదట ఇద్దరు హీరోయిన్లను తీసుకోవాలనుకున్నారు కానీ ఇప్పుడు మనసు మార్చుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే అంజలిని ఒక హీరోయిన్ గా ఎంపిక చేశారు. మరో హీరోయిన్ గా శ్రియ లేదా త్రిషను ఎంపిక చేయాలని మొదట భావించారు. కానీ ఇప్పుడు ఈ రోల్ ను పూర్తిగా కట్ చేస్తున్నట్లు సమాచారం. చాలా సంవత్సరాల తర్వాత బాలయ్య సినిమాలో ఒకే హీరోయిన్ ఆడిపాడనుంది.