సైరాలో కావాలనే పాటలను తొక్కి పెట్టారా?


Sye Raa Narasimha Reddy Song
సైరాలో కావాలనే పాటలను తొక్కి పెట్టారా?

మెగాస్టార్ చిరంజీవి 151వ చిత్రం సైరా నరసింహారెడ్డి అక్టోబర్ 2న విడుదలకు సిద్ధమవుతోంది. ఓ వైపు ప్రమోషనల్ కార్యక్రమాలకు ప్రణాళికలు వేసుకుంటూనే మరోవైపు పోస్ట్ ప్రొడక్షన్ పనులను పర్యవేక్షిస్తున్నారు. ఈ నెల 18న చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ప్లాన్ చేసినా కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల ఇప్పుడు 22న నిర్వహించనున్నారు. అయితే 18వ తారీఖున చిత్ర ట్రైలర్ ను విడుదల చేస్తారు. అయితే ఇక్కడ ఎవరికీ అర్ధం కాని ఒక అంశం.. ఇప్పటిదాకా సైరా పాటల్లో ఒక్కటి కూడా విడుదల కాలేదు.

నిజానికి సైరాలో ఉన్నవి మూడే పాటలు. అందులో ఒకటి మాంటేజ్ సాంగ్. సినిమా విడుదలకు ఇంకా రెండు వారాల సమయం మాత్రమే ఉండడంతో ఒక్క పాట కూడా విడుదల చేయకపోవడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీనిపై వినిపించే రూమర్ మెగా ఫ్యాన్స్ ను కలవరపరిచేదిగా ఉంది. మిగతా భాషల్లో ఈ పాటల రికార్డింగ్ ఇంకా పూర్తవ్వలేదని, అన్ని భాషల్లో ఒకేసారి సాంగ్ విడుదల చేయాలి కాబట్టి పాటల విడుదల ఆలశ్యమవుతున్నట్లు తెలుస్తోంది. 22 నుండి మొదలుపెట్టి తక్కువ వ్యవధిలో మూడు పాటలను కూడా విడుదల చేస్తారని అంటున్నారు. చూద్దాం మరి ఇందులో నిజం ఎంతవరకూ ఉందో.