ఇంతకీ లారెన్స్ తో చర్చలు ఫలించాయా ? లేదా ?


కాంచన చిత్రం సూపర్ హిట్ కావడంతో అదే చిత్రాన్ని హిందీలో లక్ష్మి బాంబ్ గా అక్షయ్ కుమార్ హీరోగా రీమేక్ చేస్తున్నారు . ఈ హిందీ చిత్రంతో రాఘవ లారెన్స్ దర్శకుడిగా బాలీవుడ్ కి పరిచయం కానున్నాడు . అయితే అనూహ్యంగా చిత్ర నిర్మాతల నుండి లారెన్స్ కు అవమానం జరగడంతో లక్ష్మీ బాంబ్ ప్రాజెక్ట్ నుండి తప్పుకుంటున్నట్లుగా ప్రకటించాడు లారెన్స్ . దీంతో ఆ చిత్ర బృందంలో కలకలం మొదలయ్యింది .

కట్ చేస్తే ఆ చిత్ర నిర్మాతలు లారెన్స్ తో చర్చించడానికి చెన్నై వస్తున్నట్లుగా ప్రకటించాడు లారెన్స్ . అంతేకాదు నాకు సరైన గౌరవం లభిస్తుందని ఆశిస్తే , చర్చలు విజయవంతం అయితే తప్పకుండా కాంచన రీమేక్ కి దర్శకత్వం వహిస్తాను ……. చూద్దాం చెన్నై ని నిర్మాతలు వస్తున్నారు ఏమౌతాయో ? అని ప్రకటించి రెండు రోజులు కావస్తోంది కానీ ఆ చర్చలు ఏమయ్యాయో మాత్రం లారెన్స్ మళ్ళీ ట్వీట్ చేయలేదు . ఆ నిర్మాతలు వచ్చారా ? చర్చలు జరిగాయా ? లేదా ? అప్ డేట్ ఇవ్వలేదు లారెన్స్ . అంటే మతలబు ఏంటో ? కాంచన రీమేక్ విషయాన్నీ పక్కన పెడితే తన ట్రస్ట్ ద్వారా 154 పిల్లలకు హార్ట్ ఆపరేషన్ లు చేయించాడు లారెన్స్ .