చంద్రబాబుకు నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్


Non bailable arrest warrant on Chandrababu naidu

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు మహారాష్ట్ర లోని ధర్మాబాద్ కోర్టు నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ చేసింది . 2010 లో మహారాష్ట్ర ప్రభుత్వం కడుతున్న బాబ్లీ ప్రాజెక్ట్ వల్ల తెలంగాణ ఎడారి అవుతుందని బాబ్లీ ప్రాజెక్ట్ దగ్గరకు పెద్ద ఎత్తున తెలుగుదేశం నాయకులతో కలిసి వెళ్ళాడు చంద్రబాబు . ఎనిమిదేళ్ల కిందట నిరసనలు వ్యక్తం చేసి అరెస్ట్ అయ్యాడు కూడా కట్ చేస్తే ఎనిమిదేళ్ల తర్వాత కోర్టు నోటీసులు అది కూడా నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ చేయడంతో రాజకీయ వర్గాల్లో ఒక్కసారిగా వేడి పుట్టింది . మహారాష్ట్రలో ,అలాగే కేంద్రంలో భారతీయ జనతా పార్టీ ఉంది దాంతో చంద్రబాబుని ఇరుకున పెట్టడానికి , అతడ్ని అరెస్ట్ చేసి బీజేపీ పెద్దలు రాజకీయ కక్ష్య తీర్చుకోవడానికే ఇలా కఠినంగా వ్యవహరిస్తున్నారని తెలుగుదేశం శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి .

చంద్రబాబు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న సమయంలో ఎనిమిదేళ్ల క్రితం జరిగిన సంఘటనలో ఇంతకుముందు వరకు ఒక్కసారి కూడా నోటీసులు జారీ చేయలేదు కానీ కేంద్రంతో చంద్రబాబు సవాల్ చేస్తున్న నేపథ్యంలో బాబుని రాజకీయంగా ఇబ్బంది పెట్టడానికి ఇలా పెద్ద కుట్ర పన్నారని ,ఇటువంటి బెదిరింపులకు భయపడేదిలేదని అంటున్నారు తెలుగుదేశం నాయకులు . ఈనెల 21 లోపు చంద్రబాబు నాయుడితో సహా మరో 14 మంది రాజకీయ నాయకులను అరెస్ట్ చేసి కోర్టు ముందు హాజరుపరచాలని ఆదేశించింది ధర్మాబాద్ కోర్టు . నిన్న చంద్రబాబు నాయుడు తిరుమలలో శ్రీవారి సేవలో ఉన్న సమయంలో ఈ అరెస్ట్ వారెంట్ జారీ అయినట్లు తెలుసుకున్నాడు బాబు .

English Title: Non bailable arrest warrant on Chandrababu naidu