అతడితో తిరిగింది ఇప్పుడేమో ఎవడు వాడంటోంది


nora fatehi reaction on ex lover angad bedi

బాలీవుడ్ నటుడు అంగద్ బేడీ తో చెట్టాపట్టాలేసుకొని తిరిగింది , నీ మనసు నా మనసు ఒకటే అని కవితలు చెప్పింది కట్ చేస్తే ఇప్పుడేమో అంగద్ బేడీ నా ఎవడు వాడు ? అని అంటోంది బాహుబలి లో ఐటెం సాంగ్ చేసిన ” నోరా ఫతేహి ” . తెలుగులో పలు చిత్రాల్లో ఐటెం సాంగ్స్ లో నటించిన ఈ భామ నటుడు అంగద్ బేడీ తో ప్రేమాయణం సాగించింది , ఇద్దరు కూడా ఆకాశమే హద్దుగా చెలరేగిపోయారు కట్ చేస్తే ఎక్కడో తేడా కొట్టింది అంతే ! అంగద్ బేడీ హీరోయిన్ నేహా ధూపియా ని పెళ్లి చేసుకున్నాడు దాంతో అగ్గిమీద గుగ్గిలం అవుతోంది నోరా ఫతేహి .

తాజాగా ఓ జాతీయ మీడియా తో చిట్ చాట్ చేసింది నోరా ఫతేహి , కాగా సందర్భంలో ” అంగద్ బేడీ ” కి పెళ్లి శుభాకాంక్షలు తెలిపారా ? అని యాంకర్ ప్రశ్నించడమే ఆలస్యం నోరా ఫతేహి రెచ్చిపోయింది . అంగదా ….. ఎవడు ? అసలు ఏం మాట్లాడుతున్నారు ? అసలు అలాంటి పేరు గల వాడ్ని నేను ఇంతవరకు కలవలేదు , వినలేదు కూడా అలాంటిది తెలియని వాడికి వివాహ శుభాకాంక్షలు ఎలా తెలియజేస్తాను అంటూ ఆగ్రహంతో వ్యాఖ్యానించింది . నోరా ఫతేహి కి ఇంతగా కోపం రావడానికి కారణం ఏంటంటే ఇద్దరు కూడా డేటింగ్ చేసారు కానీ నోరా కు హ్యాండ్ ఇచ్చి నేహా ధూపియా ని పెళ్లి చేసుకున్నాడు మాజీ లవర్ దాంతో అతడి పేరు వింటే చాలు ఆగ్రహంతో ఊగిపోతోంది నోరా ఫతేహి .