పోలీసులతో ఆట ఆడుకుంటున్న దాసరి ప్రభు


దర్శకరత్న దాసరి నారాయణరావు పెద్ద కొడుకు దాసరి ప్రభు హైదరాబాద్ పోలీసులతో ఓ ఆట ఆడుకుంటున్నాడు . ఈనెల 9 న హైదరాబాద్ నుండి చిత్తూర్ కి వెళ్లిన దాసరి ప్రభు తన వెంట సెల్ ఫోన్ తీసుకెళ్లకపోవడంతో అతడు ఎక్కడికి వెళ్ళాడు ? ఏం చేస్తున్నాడు ?ఎవరితో ఉన్నాడు ?అన్నది మిస్టరీ గా మారింది . దాసరి ప్రభు మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు ప్రభు కోసం గాలింపు చేపట్టారు .

అయితే తనకోసం పోలీసులు వెతుకుతున్న సమాచారం అందుకున్న ప్రభు చిత్తూర్ నుండి మళ్ళీ హైదరాబాద్ చేరుకున్నాడు . పోలీసులు ఇక్కడ కూడా వెతుకుతున్నారు అని తెలుసుకొని మళ్ళీ హైదరాబాద్ నుండి కూడా వెళ్ళిపోయాడు ఎక్కడికో . అతను ఇలా ఎందుకు చేస్తున్నాడో అర్ధం కాక పోలీసులు తల పట్టుకుంటున్నారు .