విజయ్ దేవరకొండ కోసం 30 కోట్లు పెడతారా


NOTA makers demands Rs 30 Cr for Vijay Deverakondas telugu rightsవిజయ్ దేవరకొండకు గీత గోవిందం చిత్రంతో ఎక్కడాలేని క్రేజ్ వచ్చింది , ఆ సినిమా ఏకంగా వంద కోట్ల క్లబ్ లో చేరడంతో విజయ్ దేవరకొండ తదుపరి చిత్రానికి విపరీతమైన డిమాండ్ ఏర్పడింది . వచ్చే నెల అక్టోబర్ 4న తెలుగు , తమిళ బాషలలో రూపొందిన నోటా చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు . ఇటీవలే ట్రైలర్ కూడా విడుదల కావడంతో ఈ సినిమా కు భారీ రేటు చెబుతున్నారు నిర్మాత జ్ఞానవేల్ రాజా . ఇంతకీ నోటా తెలుగు హక్కుల కోసం ఎంత చెబుతున్నాడో తెలుసా ……. 30 కోట్లు .

అసలు సినిమా మొత్తమే 20 కోట్లలో తీసి ఉంటారు అది కూడా రెండు భాషలు కలిపి కానీ ఒక్క తెలుగు హక్కుల కోసమే 30 కోట్లు డిమాండ్ చేస్తున్నాడు జ్ఞానవేల్ రాజా . ఇంత మొత్తం ఎందుకు డిమాండ్ చేస్తున్నాడో తెలుసా ……. గీత గోవిందం చిత్రంతో విజయ్ దేవరకొండ రేంజ్ అమాంతం పెరిగింది . దాంతో క్యాష్ చేసుకోవడానికి ఈ మొత్తం డిమాండ్ చేస్తున్నాడు అయితే బయ్యర్లు మాత్రం 25 కోట్ల మేరకు పెట్టడానికి ముందుకు వచ్చారు కానీ జ్ఞానవేల్ రాజా తగ్గడే ! తక్కువ డబ్బుకి ఇవ్వడానికి సిద్ధంగా లేడు , ఇస్తే నేను డిమాండ్ చేసినట్లుగా ఇవ్వండి లేదంటే వచ్చిన దారినే పోండి అని అంటున్నాడట ! దాంతో ముప్పై కోట్లకు కొనుక్కోవడం ఖాయం, ఎందుకంటే దేవరకొండా మజాకా ?

English Title: NOTA makers demands Rs 30 Cr for Vijay Deverakondas telugu rights