నోటా రివ్యూ


nota movie review

నోటా రివ్యూ :
నటీనటులు : విజయ్ దేవరకొండ , సత్యరాజ్ , నాజర్ ,మెహరీన్
సంగీతం : సామ్
నిర్మాత : జ్ఞానవేల్ రాజా
దర్శకత్వం : ఆనంద్ శంకర్
రేటింగ్ : 2. 5/ 5
రిలీజ్ డేట్ : 5 అక్టోబర్ 2018

యువతలో విపరీతమైన క్రేజ్ ఉన్న విజయ్ దేవరకొండ రాజకీయ నేపథ్యంలో నటించిన చిత్రం ” నోటా ”. ఆనంద్ శంకర్ దర్శకత్వంలో కే ఈ జ్ఞానవేల్ రాజా నిర్మించిన ఈ చిత్రం లో విజయ్ దేవరకొండ ముఖ్యమంత్రిగా నటించాడు . మరి ఈ హీరో ముఖ్యమంత్రిగా ప్రేక్షకులను అలరించాడా ? లేదా ? అన్నది తెలియాలంటే కథ లోకి వెళ్లాల్సిందే .

కథ :

వరుణ్ ( విజయ్ దేవరకొండ )ముఖ్యమంత్రి (నాజర్ ) తనయుడు , అయినప్పటికీ బాధ్యత లేకుండా జల్సాగా తిరుగుతుంటాడు . అమ్మాయిలు , ఫ్రెండ్స్ అంటూ తిరిగే వరుణ్ ని అకస్మాత్తుగాకొత్త ముఖ్యమంత్రి గా ప్రకటిస్తాడు . అసలు ముఖ్యమంత్రి గా వరుణ్ ని ఎందుకు నియమించారు ? దాని వెనుక ఉన్న అజెండా ఏంటి ? యువ ముఖ్యమంత్రిగా వరుణ్ ఎలాంటి పరిపాలన అందించాడు ? అల్లకల్లోలంగా ఉన్న రాష్ట్రాన్ని సవ్య దిశలో నడిపించాడా ? రాజకీయ నాయకుల క్రీడలో పావుగా మారాడా ? తదితర విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే .

హైలెట్స్ :

విజయ్ దేవరకొండ
ఎంచుకున్న లైన్
ఇంటర్వెల్ బ్లాక్

డ్రా బ్యాక్స్ :

తమిళ్ నేటివిటీ
ఎంటర్ టైన్ మెంట్ లేకపోవడం
స్క్రీన్ ప్లే

నటీనటులు :

జల్సాగా తిరిగే యువకుడిగా , ముఖ్యమంత్రిగా విభిన్న పార్శ్వాలు కలగలిపిన వరుణ్ క్యారెక్టర్ ని పోషించి మెప్పించాడు విజయ్ దేవరకొండ . అయితే తనదైన మార్క్ ని మాత్రం చూపించలేకపోయారు ఈ క్యారెక్టర్ లో . విజయ్ అంటేనే అగ్రెసివ్ కానీ ఇందులో ఎక్కడ కూడా తన శైలి ని ప్రదర్శించే అవకాశం రాలేదు . కానీ ఓ యువ ముఖ్యమంత్రిగా మాత్రం చమక్కులు చూపించాడు . విభిన్న కథా చిత్రాలను ఎంచుకుంటూ దూసుకుపోతున్న విజయ్ దేవరకొండ ఆ మేజిక్ ని మాత్రం ఇందులో చూపించలేకపోయారు . మెహరీన్ తో పెద్దగా స్క్రీన్ షేర్ చేసుకున్న సంఘటనలు లేకపోవడం మరొక మైనస్ అనే చెప్పాలి . నాజర్ , సత్యరాజ్ తదితరులు తమతమ పాత్రలకు న్యాయం చేసారు .

సాంకేతిక వర్గం :

దర్శకుడు ఆనంద్ శంకర్ రాజకీయ నేపథ్యంలో మంచి లైన్ ఎంచుకున్నాడు కానీ దాన్ని సరైన దిశగా నడిపించడంలో విఫలమయ్యాడు . ముఖ్యంగా తమిళ నేటివిటీ తో తెలుగు ప్రేక్షకులు కాస్త అసహనానికి గురయ్యేలా చేసాడు . జ్ఞానవేల్ రాజా నిర్మాణ విలువలు బాగున్నాయి . ఛాయాగ్రహణం ఈ చిత్రానికి హైలెట్ గా నిలిచింది .

ఓవరాల్ గా :

రాజకీయ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ ని నిరాశపరచడం ఖాయం .

English Title: nota movie review

Click here for English Review