నోటా రిలీజ్ వివాదం రేపే తేలిపోనుంది


NOTA release date announcement tomorrow

విజయ్ దేవరకొండకు గీత గోవిందం చిత్రంతో ఎక్కడాలేని క్రేజ్ రావడంతో నోటా చిత్రానికి ఇబ్బందులు వచ్చాయి . గీత గోవిందం చిత్రం వల్ల నోటా చిత్రానికి ఇబ్బందులు ఏంటి ? అని అనుకుంటున్నారా ? గీత గోవిందం చిత్రం చిన్న చిత్రంగా విడుదలై వసూళ్ల సునామి సృష్టించి 120 కోట్ల పైచిలుకు కలెక్షన్లు రాబట్టింది దాంతో విజయ్ దేవరకొండ కున్న క్రేజ్ ఏంటో తెలిసొచ్చింది . ఇంకేముంది దాన్ని క్యాష్ చేసుకోవడానికి ఎవరికి వాళ్ళు పెద్ద ఎత్తున డ్రామాలు ఆడుతున్నారు . గీత గోవిందం చిత్రం విడుదల కాకముందు నోటా బిజినెస్ వేరు ,గీత గోవిందం సక్సెస్ తర్వాత నోటా హాట్ కేక్ అయ్యింది . ముందుగా అనుకున్న దాని ప్రకారం తెలుగు హక్కుల్లో రచయిత శశాంక్ వెన్నెలకంటి వాటాదారుడు కానీ భారీ సక్సెస్ తర్వాత నోటా రేంజ్ పెరిగింది దాంతో శశాంక్ వెన్నెలకంటి ని ఏకంగా సినిమా పేర్ల నుండే తొలగించాడు నిర్మాత జ్ఞానవేల్ రాజా . దాంతో పోలీసులను ఆశ్రయించాడు శశాంక్ వెన్నెలకంటి .

ఇక ఈ వివాదం రేపు ఓ కొలిక్కి వచ్చే అవకాశం ఉందని స్వయంగా హీరో విజయ్ దేవరకొండ ట్వీట్ చేసాడు . అలాగే నోటా చిత్రాన్ని ఎప్పడు విడుదల చేయమంటారు ? అని నెటిజన్లను అడుగుతున్నాడు కూడా . వాళ్లలో ఎక్కువగా అక్టోబర్ 5న విడుదల చేయమని చెబుతున్నారు . మరి ఈ వివాదం కొలిక్కి వస్తే అక్టోబర్ 5న వస్తుంది లేదంటే అక్టోబర్ 18 కి వెళ్లొచ్చు . ఆనంద్ శంకర్ దర్శకత్వంలో రాజకీయ నేపథ్యంలో తెరకెక్కిన నోటా తమిళ్ లో కూడా విడుదల కానుంది .

English Title: NOTA release date announcement tomorrow