నితిన్ తర్వాత నాగ శౌర్య కూడా దుబాయ్ వైపేనితిన్ తర్వాత నాగ శౌర్య కూడా దుబాయ్ వైపే
నితిన్ తర్వాత నాగ శౌర్య కూడా దుబాయ్ వైపే

యంగ్ హీరో నితిన్ ప్రస్తుతం దుబాయ్ లో ఉన్న విషయం తెల్సిందే. తన నెక్స్ట్ సినిమా రంగ్ దే సినిమా షూటింగ్ నిమిత్తం దుబాయ్ కు వెళ్ళాడు. గత కొన్ని రోజులుగా అక్కడే షూటింగ్ జరుగుతోంది. వెంకీ అట్లూరి ఈ సినిమాకు దర్శకుడు కాగా కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తోంది. ఇదిలా ఉంటే మరో యువ హీరో నాగ శౌర్య కూడా ఇప్పుడు దుబాయ్ కు వెళ్తున్నట్లు సమాచారం.

నాగ శౌర్య కూడా షూటింగ్ నిమిత్తం దుబాయ్ కు వెళుతున్నాడు. అక్కడ కరోనా అదుపులో ఉన్న నేపథ్యంలో అక్కడ షూటింగ్ చేసుకోవడం మంచిదన్న అభిప్రాయం నేపథ్యంలో టాలీవుడ్ దుబాయ్ పై ఫోకస్ పెంచింది.

నాగ శౌర్య నటిస్తోన్న చిత్రం వరుడు కావలెను. ఈ సినిమాను లక్ష్మి సౌజన్య తెరకెక్కిస్తుండగా రీతూ వర్మ హీరోయిన్ గా నటిస్తోంది. హీరో, హీరోయిన్ల మధ్య వచ్చే కీలక సన్నివేశాలను ఈ షెడ్యూల్ లో చిత్రీకరించనున్నారు.

ఈ రెండు సినిమాలను సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తుండడం విశేషం.