స‌ల్మాన్‌ని గోవాకు రాకుండా బ్యాన్ చేస్తార‌ట‌!


స‌ల్మాన్‌ని గోవాకు రాకుండా బ్యాన్ చేస్తార‌ట‌!
స‌ల్మాన్‌ని గోవాకు రాకుండా బ్యాన్ చేస్తార‌ట‌!

సినీతార‌ల్ని డెమీగాడ్స్‌గా చూసి మురిసిపోయే అభిమానులు వాళ్ల‌ని ఒక్క‌సారి క‌ళ్లారా చూడాల‌ని, వారితో మాట్లాడాల‌ని, క‌లిసి ఓ సెల్ఫీ తీసుకోవాల‌ని ఉళ్లిళ్లూరుతుంటారు. అది కొన్నిసార్లు నిజ‌మైతే కొన్ని సార్లు ఇబ్బందులు తెచ్చిపెడుతుంటుంది. అలాంటి అనుభ‌వ‌మే బాలీవుడ్ హీరో స‌ల్మాన్‌ఖాన్ అభిమానికి ఎదురైంది. వ‌రుస వివాదాల‌తో నిత్యం వార్త‌ల్లో నిలుస్తుంటారు స‌ల్మాన్‌ఖాన్‌. తాజాగా ఓ అభిమాని అత్యుత్సాహాం కార‌ణంగా మ‌ళ్లీ వార్త‌ల్లో నిలిచారు.

గోవాలోని ప‌నాజీ ఎయిర్ పోర్ట్‌లో ఓఉద్యోగి స‌ల్మాన్‌ఖాన్ వ‌స్తుండ‌టం గ‌మ‌నించి సెల్ఫీ దిగేందుకు ప్ర‌య‌త్నించాడు. అయితే త‌న ప‌నికి విసుగుపుట్టిన స‌ల్మాన్‌ఖాన్ అత‌ని ఫోన్ లాక్కొని లాగే బ‌య‌టికి వెళ్లిపోయాడు. దీనికి సంబంధించిన ఓ వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. దీనిపై ఆగ్ర‌హించిన నేష‌న‌ల్ కాంగ్రెస్ స్టూడెంట్స్ స‌ల్మాన్‌ని గోవాకు రాకుండా బ్యాన్ చేయాల‌ని, లేదంటే అత‌ను బేష‌ర‌తుగా క్ష‌మాప‌ణ‌లు చెప్పాల‌ని గోవా ముఖ్య‌మంత్రికి విజ్ఞ‌ప్తి చేయ‌డం చ‌ర్చ‌నీయాంశంగా మారింది.

గోవా బీజేపీ జ‌న‌ర‌ల్ సెక్ర‌ట‌రీ, మాజీ ఎంపీ న‌రేంద్ర సావాయిక‌ర్ కూడా స‌ల్మాన్‌పై నిప్పులు చెరిగారు. స‌ల్మాన్ త‌న ప‌ద్ద‌తి మార్చుకోవాల‌ని, ప‌నాజీ ఎయిర్‌పోర్ట్‌లో త‌ను చేసిన ప‌నికి బేష‌ర‌తుగా క్ష‌మాప‌ణ‌లు చెప్పాల‌ని డిమాండ్ చేస్తున్నారు. దీనిపై స‌ల్మాన్ ఎలాంటి కౌంట‌ర్ ఇస్తారో చూడాల‌ని బాలీవుడ్ జ‌నాలు ఎదురుచూస్తున్నారు.