సిగరెట్ తాగుతున్న పిక్స్ కి యమా క్రేజ్


NTR and ANR Smoking Pic goes VIRAL

ఇద్దరు లెజెండ్స్ నందమూరి తారకరామారావు ,అక్కినేని నాగేశ్వర్ రావు లు కలిసి సిగరెట్ తాగుతున్న ఫోటోలకు విపరీతమైన క్రేజ్ వచ్చింది . ఎన్టీఆర్ అక్కినేని అనగానే నిజంగానే వాళ్లే అనుకుంటారు అంత అద్భుతంగా వచ్చింది ఫోటో , అయితే ఇద్దరు లెజెండ్స్ సిగరెట్ తాగుతున్న ఫోటోల్లో ఉన్నది బాలయ్య , సుమంత్ లు . ఎన్టీఆర్ బయోపిక్ లో ఎన్టీఆర్ గా బాలయ్య నటిస్తుండగా ఏఎన్నార్ గా సుమంత్ నటిస్తున్న విషయం తెలిసిందే . అయితే ఈరోజు మహానటుడు అక్కినేని నాగేశ్వర్ రావు పుట్టినరోజు కావడంతో ఆ సందర్భాన్ని పురస్కరించుకొని ఉదయమే అక్కినేని గెటప్ లో ఉన్న సుమంత్ లుక్ ని రిలీజ్ చేయగా దానికి అద్భుత స్పందన వచ్చింది .

కట్ చేస్తే రెస్పాన్స్ బాగా రావడంతో సాయంత్రానికి మరో పిక్ రిలీజ్ చేసారు . ఇక ఈ పిక్ లో ఎన్టీఆర్ గెటప్ లో బాలయ్య అక్కినేని గెటప్ లో సుమంత్ సిగరెట్ తాగుతున్నారు . ఇక ఈ లుక్ కి అయితే ట్రెమండస్ రెస్పాన్స్ వస్తోంది . మళ్ళీ ఎన్టీఆర్ – అక్కినేని లను చూసిన ఫీలింగ్ కలుగుతోంది అంటూ సోషల్ మీడియాలో ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు నెటిజన్లు . క్రిష్ దర్శకత్వంలో రూపొందుతున్న ఎన్టీఆర్ బయోపిక్ కి విపరీతమైన క్రేజ్ ఏర్పడింది . ఇక ఈ చిత్రాన్ని సంక్రాంతి కానుకగా 2019 జనవరిలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు .

English Title: NTR and ANR Smoking Pic goes VIRAL