రకుల్ ని తిడుతున్న ఎన్టీఆర్ చరణ్ ఫ్యాన్స్

NTR and Charan fans insults rakul preet singh in social mediaహీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ ని ఎన్టీఆర్ , చరణ్ ఫ్యాన్స్ తిడుతూ పండగ చేసుకుంటున్నారు . పాపం ! రకుల్ ప్రీత్ సింగ్ చేసిన తప్పు ఏంటంటే …… ఎన్టీఆర్ , చరణ్ , రాజమౌళి ల సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కావడంతో వాళ్ళ ఫోటో పెట్టి శుభాకాంక్షలు తెలపడమే ఆమె చేసిన నేరం . రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ మల్టీస్టారర్ చిత్రం కావడంతో వాళ్లకు శుభాకాంక్షలు అందజేసింది అంతే ! అయితే ఎన్టీఆర్ , చరణ్ ల ఫ్యాన్స్ కు మరోలా అర్ధం అయినట్లుంది అందుకే రకుల్ ని తిడుతూ పండగ చేసుకున్నారు .

ఎన్టీఆర్ జోలికి రావద్దు తల్లో , నీకు అంత సీన్ లేదు అంటూ ఎన్టీఆర్ ఫ్యాన్స్ రకుల్ ని అవమానించగా చరణ్ ఫ్యాన్స్ కూడా తక్కువేమి తినలేదు . నువ్ ఎన్ని బిస్కెట్లు వేసినా ఆర్ ఆర్ ఆర్ లో నీకు ఛాన్స్ ఇవ్వరు అంటూ ఓ ఆట ఆడేసుకున్నారు . ఈమధ్య రకుల్ ప్రీత్ సింగ్ ని నెటిజన్లు చాలా రకాలుగా అవమానించారు . ఆమధ్య వేసుకున్న డ్రెస్ తో అస్సలు బాగోలేవని కామెంట్ చేయగా మంచు లక్ష్మి తో అసభ్య కరంగా దిగిన ఫోటో ని చూసి లెస్బియన్స్ అంటూ కామెంట్స్ చేసారు పాపం . ఈ భామ టాలీవుడ్ లో స్టార్ అయిపోయినట్లే అనుకుంటే ఆ స్టార్ డం ఎంతోకాలం నిలవలేదు మరి .

English Title: NTR and Charan fans insults rakul preet singh in social media