మహేష్ కోసం ఎన్టీఆర్ ,చరణ్ లను పిలుస్తున్నారట


ntr and charan guests for mahesh bharath ane nenu audio eventసూపర్ స్టార్ మహేష్ బాబు తాజాగా కొరటాల శివ దర్శకత్వంలో భరత్ అనే నేను చిత్రంలో నటిస్తున్నాడు కాగా ఆ చిత్ర ఆడియో వేడుకని ఏప్రిల్ 7న హైదరాబాద్ లో అంగరంగ వైభవంగా నిర్వహించడానికి సన్నాహాలు చేస్తున్నారు అయితే ఆ ఆడియో వేడుకకు ముఖ్యఅతిథులుగా ఎవరిని పిలవనున్నారో తెలుసా …… యంగ్ టైగర్ ఎన్టీఆర్ , మెగా పవర్ స్టార్ రాంచరణ్ లను ఆహ్వానించాలని భావిస్తున్నారట ఆ చిత్ర బృందం .

కొరటాల శివ ఎన్టీఆర్ తో జనతా గ్యారేజ్ అనే బ్లాక్ బస్టర్ ని అందించాడు , ఇక ఇప్పుడేమో చరణ్ తో ఒక సినిమా సెట్స్ పైకి తీసుకెళ్లాడు దాంతో తన హీరోలను మహేష్ కోసం పిలవాలని డిసైడ్ అయినట్లుగా తెలుస్తోంది . కొరటాల శివ ఇప్పటివరకు దర్శకత్వం వహించిన మూడు సినిమాలు కూడా సూపర్ హిట్ అయ్యాయి దాంతో భరత్ అనే నేను చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి . ఇక మహేష్ కోసం ఎన్టీఆర్ , చరణ్ లు కనుక వస్తే ఆ ఆడియో వేడుక ఎలా ఉంటుందో ఊహించతరమా !