ఎన్టీఆర్ , చరణ్ లుక్స్ రివీల్ అయ్యేది ఎప్పుడో తెలుసా ?


NTR and charan looks revealed on august 15 th ?
NTR and charan looks revealed on august 15 th ?

జూనియర్ ఎన్టీఆర్ , రాంచరణ్ లు ఆర్ ఆర్ ఆర్ చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే . భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ఎన్టీఆర్ కొమరం భీమ్ గా చరణ్ అల్లూరి సీతారామరాజు గా నటిస్తున్నారు . అయితే ఆ ఇద్దరి లుక్స్ ఎలా ఉంటాయో మాత్రం తెలియదు దాంతో ఈ స్వాతంత్య్ర సమరయోధులను స్వాతంత్య్ర దినోత్సవమైన ఆగస్టు 15 న ప్రేక్షకులకు పరిచయం చేయనున్నట్లు తెలుస్తోంది .

భారతావని స్వేచ్ఛ కోసం ఎవరి పంథాలో వాళ్ళు పోరాటం చేసారు ఈ ఇద్దరు యోధులు కూడా . దాంతో పోరాటతత్వానికి ప్రతిభింభమైన ఆగస్టు 15 న ఎన్టీఆర్ లుక్ ని అలాగే చరణ్ లుక్ ని రివీల్ చేయనున్నట్లు తెలుస్తోంది . సినిమా రిలీజ్ వచ్చే ఏడాది 2020 లో కానీ ఈలోపే లుక్ రిలీజ్ చేయడం వల్ల ఈ సినిమాపై మరిన్ని అంచనాలు పెంచొచ్చు అని భావిస్తున్నారట దర్శకులు ఎస్ ఎస్ రాజమౌళి .