అప్పుడే తిరిగొచ్చిన యంగ్‌టైగ‌ర్ ఫ్యామిలీ‌!


అప్పుడే తిరిగొచ్చిన యంగ్‌టైగ‌ర్ ఫ్యామిలీ‌!
అప్పుడే తిరిగొచ్చిన యంగ్‌టైగ‌ర్ ఫ్యామిలీ‌!

యంగ్‌టైగ‌ర్ ఎన్టీఆర్ న‌టిస్తున్న తాజా చిత్రం `ఆర్ ఆర్ ఆర్‌`. ఫ్రీడ‌మ్ ఫైట‌ర్స్ మ‌న్యం పులి అల్లూరి సీతారామ‌రాజు, గోండు బెబ్బులి కొమ‌రం భీంలకు సంబంధించిన క‌థ‌కు ఫిక్ష‌న‌ల్ స్టోరీని జోడించి రాజ‌మౌళి ఈ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నారు. ఆ ఇద్ద‌రికీ వున్న సంబంధం ఏంటి?.. స్వాతంత్య్ర సంగ్రామంలో వీరు క‌లిశారా? క‌లిస్తే ఏం జ‌రిగింది? .. ఇద్ద‌రూ క‌లిసి ఏం చేశారు అన్న చిన్న ఊహ‌కు తెర‌రూపంగా `ఆర్ ఆర్ ఆర్‌`ని తెర‌కెక్కిస్తున్నారు.

గ‌త ఏడు నెల‌లుగా లాక్‌డౌన్ కార‌ణంగా ఆగిపోయిన ఈ మూవీ షూటింగ్ ఇటీవ‌లే పునః ప్రారంభ‌మైంది. అనుకున్న స‌మ‌యానికి సినిమాని ప్రేక్ష‌కుల ముందుకు తీసుకురావాల‌ని ద‌ర్శ‌కుడు కంటిన్యూగా షూటింగ్ చేస్తున్నారు. షూట్ ప్రారంభ‌మైన ద‌గ్గ‌రి నుంచి కంటిన్యూగా షూటింగ్‌లో పాల్గొంటున్న యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ బ్రేక్ తీసుకున్నారు.

గ‌త వారం విశ్రాంతి కోసం బ్రేక్ తీసుకున్న ఎన్టీఆర్ ఫ్యామిలీతో క‌లిసి మినీ వెకేష‌న్ కోసం దుబాయ్ వెళ్లారు. తాజాగా త‌న వెకేష‌న్‌ని పూర్తి చేసుకున్న ఎన్టీఆర్ బుధ‌వారం హైద‌రాబాద్ తిరిగి వ‌చ్చేశారు. శంషాబాద్ ఏయిర్ పోర్ట్‌లో ఎన్టీఆర్ ఫ్యామిలీతో క‌లిసి తిరిగి ల్యాండ‌య్యారు. దీనికి సంబంధించిన ఫొటోలు సోష‌ల్ మీడియాలో సంద‌డి చేస్తున్నాయి.