20 లక్షలు సహాయం చేసిన ఎన్టీఆర్ ,కళ్యాణ్ రామ్NTR and Kalyanram donate 20 laks for Cyclone Titli Relief

ఆంధ్రప్రదేశ్ లో తిత్లి తుఫాన్ భీభత్సం వల్ల శ్రీకాకుళం , విజయనగరం తీవ్రంగా నష్టపోవడంతో స్పందించిన ఎన్టీఆర్ 15 లక్షలు , నందమూరి కళ్యాణ్ రామ్ 5 లక్షల విరాళం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సహాయనిధికి అందజేసారు . నందమూరి వారసులతో పాటుగా మెగా హీరో వరుణ్ తేజ్ కూడా 5 లక్షల సహాయం అందించాడు . దానికి ముందు హీరో విజయ్ దేవరకొండ అలాగే సంపూర్నేష్ బాబు లు కూడా సహాయం అందించారు . ఎన్టీఆర్ 15 లక్షలు , కళ్యాణ్ రామ్ 5 లక్షలతో మొత్తం 20 లక్షల రూపాయలు నందమూరి కుటుంబం నుండి ముట్టినట్లు అయ్యింది .

ఆంధ్రప్రదేశ్ లోని రెండు జిల్లాలతో పాటుగా ఒడిస్సా రాష్ట్రం కూడా తిత్లి తుఫాన్ దాటికి వివలవిలలాడింది . ఇక శ్రీకాకుళం లోని తీర ప్రాంతాలు తీవ్రంగా నష్టపోయాయి దాంతో పెద్ద ఎత్తున సహాయ కార్యక్రమాలు చేస్తున్నారు . ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఎప్ప్పటికప్పుడు అప్రమత్తం చేస్తుండటంతో ప్రాణనష్టం తప్పింది . ప్రజలకు ఎప్పుడు కష్టాలు వచ్చినా సినిమా రంగం ముందుండి ఆదుకున్న సందర్భాలు ఎన్నో ఎన్నెన్నో ! ఇక ఎన్టీఆర్ నటించిన అరవింద సమేత ఇటీవలే విడుదలై సంచలన విజయం దిశగా దూసుకుపోతున్న విషయం తెలిసిందే .

English Title: NTR and Kalyanram donate 20 laks for Cyclone Titli Relief