ఎన్టీఆర్ జ‌యంతికి ఆ ఇద్ద‌రు దూరం!


ఎన్టీఆర్ జ‌యంతికి ఆ ఇద్ద‌రు దూరం!
ఎన్టీఆర్ జ‌యంతికి ఆ ఇద్ద‌రు దూరం!

ఎన్టీఆర్ జ‌యంతి రోజున ప్ర‌తీ ఏడాది కుటుంబ స‌భ్యులు అంతా హైద‌రాబాద్‌లోని ఎన్టీఆర్ ఘాట్‌కు చేరుకుని నివాళులు అర్పిస్తుంటారు. అయితే లాక్‌డౌన్ కార‌ణంగా ఈ ఏడాది అది కుద‌ర‌డం లేదు. కోవిడ్ విజృంభిస్తున్న నేప‌థ్యంలో ఎన్టీఆర్ ఘాట్ వ‌ద్ద అత్య‌ధిక సంక్ష‌లో అభిమానులు సమూహంగా ఏర్ప‌డే అవ‌కాశం వుంద‌ని తెలిసింది.

దీంతో అప్ప‌మ‌త్త‌మైన ఎన్టీఆర్ కుటుంబ స‌భ్యులు ముఖ్యంగా యంగ్‌టైగ‌ర్ ఎన్టీఆర్‌, నంద‌మూరి క‌ల్యాణ్‌రామ్ గురువారం ఎన్టీఆర్ జ‌యంతి సంద‌ర్భంగా ఎన్టార్ ఘాట్‌కి రావ‌డం లేద‌ని పీఆర్ టీమ్ ద్వారా వెల్ల‌డించారు. ఆ రోజు ఇంటి వ‌ద్దే వుండి నివాళులు అర్పించాల‌ని ఎన్టీఆర్‌, క‌ల్యాణ్‌రామ్ నిర్ణ‌యించుకున్నార‌ట‌.

ప్ర‌జ‌ల భ‌ద్ర‌త దృష్ట్యా ఎన్టీఆర్‌, క‌ల్యాణ్‌రామ్ గురువారం ఎన్టీఆర్ ఘాట్‌ని సంద‌ర్శించ‌డం లేద‌ని, స్వ‌ర్గీయ నంద‌మూరి తార‌క రామారావుకి త‌మ ఇంటి వ‌ద్దే నివాళులు అర్పించ‌నున్నార‌ని, లాక్‌డౌన్‌కు విరుద్ధంగా ప్ర‌జ‌లు గుమిగూడ‌వ‌ద్ద‌న్న కార‌ణంతో ఈ నిర్ణ‌యం తీసుకున్నార‌ని వారి పీఆర్వో మ‌హేష్ కోనేరు ట్విట్ట‌ర్ ద్వారా వెల్ల‌డించారు.