ఎన్టీఆర్ కోసం భ‌లే బ్యాక్‌డ్రా‌ప్‌ని సెట్ చేశాడే?


ఎన్టీఆర్ కోసం భ‌లే బ్యాక్‌డ్రా‌ప్‌ని సెట్ చేశాడే?
ఎన్టీఆర్ కోసం భ‌లే బ్యాక్‌డ్రా‌ప్‌ని సెట్ చేశాడే?

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ న‌టిస్తున్న భారీ మ‌ల్టీస్టార‌ర్ మూవీ `ఆర్ ఆర్ ఆర్‌`. ద‌ర్శ‌క‌ధీరుడు జ‌క్క‌న్న అత్యంత భారీ స్థాయిలో తెర‌కెక్కిస్తున్నారు. డీవీవీ దాన‌య్య దాదాపు 350 కోట్ల భారీ బ‌డ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మేజ‌ర్ షూటింగ్ పార్ట్ పూర్త‌యింది. కానీ ప‌లు కీల‌క స‌న్నివేశాలు, అలియాభ‌ట్‌, రామ్‌చ‌ర‌ణ్ ల కీల‌క ఘ‌ట్టాలు, ఎన్టీఆర్‌కి సంబంధించిన సీన్స్ , ఎన్టీఆర్‌, రామ్చ‌ర‌ణ్‌కు సంబంధించిన స‌న్నివేశాల చిత్రీక‌ర‌ణ బ్యాలెన్స్‌గా వుంద‌ట‌.

త్వ‌ర‌లోనే ఈ స‌న్నివేశాల‌కు సంబంధించిన షూటింగ్ ప్రారంభం కాబోతోంది. ఇదిలా వుంటే ఈ మూవీ త‌రువాత త్రివిక్ర‌మ్ సినిమాతో పాటు `కేజీఎఫ్‌` ఫేమ్ ప్ర‌శాంత్ నీల్ ద‌ర్శ‌క‌త్వ‌లో ఎన్టీఆర్ ఓ పాన్ ఇండియా స్థాయి చిత్రాన్ని ప్లాన్ చేస్తున్నారంటూ వ‌రుస క‌థ‌నాలు వినిపిస్తున్న విష‌యం తెలిసిందే. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీమేక‌ర్స్ నిర్మించ‌బోతోంది. ఈ చిత్రం కోసం ఇండో – పాక్ విడిపోవ‌డం, ఆ త‌రువాత యుద్ధం వంటి కీల‌క అంశాల నేప‌థ్యంలో ఈ చిత్ర నేప‌థ్యాన్ని సెట్ చేసిన‌ట్టు వార్త‌లు వినిపిస్తున్నాయి.

దీని కోసం ఏకంగా మైత్రీ సంస్థ 250 కోట్లు బ‌డ్జెట్‌ని సెట్ చేసిన‌ట్టు వార్త‌లు వినిపిస్తున్నాయి. ఎన్టీఆర్ బ‌ల్క్ డేట్స్ ఇవ్వ‌డానికి సిద్ధంగా వున్నార‌ట‌. 2022లో ఈ చిత్రం సెట్స్ పైకి రానున్న‌ట్టు తెలుస్తోంది. 2023లో ప్రేక్ష‌కుల ముందుకు ఈ ప్రాజెక్ట్‌ని తీసుకురావ‌డానికి ద‌ర్శ‌కుడు ప్ర‌శాంత్ నీల్ ప్లాన్ చేస్తున్న‌ట్టు ఇన్ సైడ్ టాక్‌.