ఎన్టీఆర్,విజయ్ దేవరకొండలలో హిట్ కొట్టేదెవరో


Ntr and vijay devarakonda are fighting for successయంగ్ టైగర్ ఎన్టీఆర్ తో దసరా బరిలో తలపడటానికి సిద్దమయ్యాడు విజయ్ దేవరకొండ . వారం రోజుల వ్యవధిలో ఇద్దరు హీరోలు పోటీపడుతున్నారు తమ చిత్రాలతో . విజయ్ దేవరకొండకు అనూహ్యంగా విపరీతమైన క్రేజ్ వచ్చిన విషయం తెలిసిందే . యువతలో విజయ్ దేవరకొండ కు పిచ్చ క్రేజ్ వచ్చింది తాజాగా రిలీజ్ అయిన గీత గోవిందం చిత్రంతో వంద కోట్లని అవలీలగా వసూల్ చేసాడు దాంతో ట్రేడ్ విశ్లేషకులు సైతం ఆశ్చర్యానికి లోనయ్యారు విజయ్ క్రేజ్ ని చూసి .

అక్టోబర్ 4న విజయ్ దేవరకొండ నటించిన ” నోటా ” చిత్రం విడుదల అవుతుండగా అక్టోబర్ 10న ఎన్టీఆర్ నటించిన అరవింద సమేత వీర రాఘవ చిత్రం విడుదలకు సిద్ధం అవుతోంది . అంటే ఇద్దరి మధ్య గ్యాప్ వారం రోజులన్న మాట ! ఎన్టీఆర్ కు విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది అలాగే తిరుగులేని స్టార్ అన్న విషయం కూడా అందరికీ తెలిసిందే .పైగా రాయలసీమ నేపథ్యంలో అందునా త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం కావడంతో అరవింద సమేత పై భారీ అంచనాలు నెలకొన్నాయి . అయితే వారం గ్యాప్ లో రెండు సినిమాలు అంటే ఇద్దరికీ పోరాటమే ! ఇద్దరు హీరోలు సక్సెస్ కోసం పోటీ పడుతున్నారు మరి ఈ ఇద్దరు హీరోలలో హిట్ కొట్టేది ఎవరో ? ఇద్దరూ హిట్స్ కొడతారా ? పై చేయి సాధిస్తారా ? అన్నది తెలియాలంటే మరో నెలరోజులు ఎదురు చూడాల్సిందే .

English Title: ntr and vijay devarakonda are fighting for success