అరవింద సమెత రిలీజ్ ఎప్పుడో తెలుసా


ntr aravinda sametha veera raghava film gets release date

యంగ్ టైగర్ ఎన్టీఆర్ తాజాగా త్రివిక్రమ్ దర్శకత్వంలో అరవింద సమేత వీర రాఘవ చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే . కాగా ఆ చిత్రాన్ని దసరా కానుకగా విడుదల చేయాలనీ ముందే డిసైడ్ అయ్యారు ఇక ఇప్పుడేమో రిలీజ్ డేట్ కూడా ప్రకటించారు . ఇంతకీ అరవింద సమేత వీర రాఘవ చిత్రం విడుదల తేదీ ఎప్పుడో తెలుసా …… అక్టోబర్ 10. దసరా కానుకగా అక్టోబర్ 10 బుధవారం రోజున విడుదల చేయడానికి ముహూర్తం నిర్ణయించారు దర్శక నిర్మాతలు .

రాయలసీమ ఫ్యాక్షన్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ఎన్టీఆర్ సరసన పూజా హెగ్డే , ఈషా రెబ్బా నటిస్తున్నారు . ఫ్యామిలీ ఎమోషన్స్ తో పాటు రాయలసీమ ఫ్యాక్షన్ ని జతకట్టి ఎన్టీఆర్ ని పవర్ ఫుల్ గా చూపించనున్నాడు త్రివిక్రమ్ . ఇటీవలే విడుదలైన ఎన్టీఆర్ లుక్ కి అద్భుతమైన స్పందన వచ్చింది . దాంతో ఆ చిత్ర బృందం చాలా సంతోషంగా ఉంది . ఇక దసరా బరిలో ఎన్టీఆర్ దిగితే రికార్డుల గురించి చెప్పతరమా !