అరవింద సమేత పాట వచ్చేసింది


NTR Aravinda sametha veera raghava lyrical song releasedయంగ్ టైగర్ ఎన్టీఆర్ తాజా చిత్రం అరవింద సమేత వీర రాఘవ చిత్రంలోని ” అనగనగనగా ” అనే పాటని రిలీజ్ చేసారు . ఇప్పుడా పాట వైరల్ అయ్యేలా ఉంది ఎందుకంటే కొద్దిరోజులుగా నందమూరి కుటుంబం విషాదంలో ఉంది దాంతో ఈ పాటలో నందమూరి కుటుంబంతో పాటుగా అభిమానులు కూడా ఫుల్ ఖుషీ అవ్వడం ఖాయం . త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని హారికా హాసిని క్రియేషన్స్ పతాకంపై రాధాకృష్ణ నిర్మిస్తున్న విషయం తెలిసిందే . ఎస్ ఎస్ తమన్ సంగీతం అందించగా ఈ పాటతో ఎన్టీఆర్ అభిమానులను సంతషంలో ముంచెత్తాడు తమన్ .

లిరికల్ వీడియోతో పాటుగా ఎన్టీఆర్ పూజా హెగ్డే పాల్గొన్న ఒక చిన్న సన్నివేశాన్ని కూడా జతకలిపి విడుదల చేసారు . రాయలసీమ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం పై ఎన్టీఆర్ అభిమానులు చాలా ఆశలు పెట్టుకున్నారు . వరుస విజయాలతో మంచి జోరుమీదున్న ఎన్టీఆర్ కు ఈ అరవింద సమేత కూడా పెద్ద హిట్ ఇచ్చేలాగే ఉంది . జగపతిబాబు , నాగబాబు , ఈషా రెబ్బా, సునీల్ కీలక పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రాన్ని అక్టోబర్ 11న దసరా కానుకగా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు .

English Title: NTR Aravinda sametha veera raghava lyrical song released